హైదరాబాదులో దారుణం: పాపపై లైంగిక దాడి చేసి, చంపేసి, బొంతలో శవాన్ని చుట్టి....

Published : Sep 10, 2021, 07:28 AM ISTUpdated : Sep 10, 2021, 08:19 AM IST
హైదరాబాదులో దారుణం: పాపపై లైంగిక దాడి చేసి, చంపేసి, బొంతలో శవాన్ని చుట్టి....

సారాంశం

హైదరాబాదులోని సైదాబాదు సింగరేణి కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రాజు అనే యువకుడు ఆరేళ్ల పాపపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను చంపేసి, పారిపోయాడు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సైదాబాదులో గల సింగరేణి కాలనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక రాజు అనే వ్యక్తి ఇంట్లో అర్థరాత్రి శవమై కనిపించింది. పాపపై రాజు లైంగిక దాడి చేసి, ఆ తర్వాత ఆమెను చంపేసి, శవాన్ని బొంతలో చుట్టి ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

బాలికను చంపిన తర్వాత రాజు పరారైనట్లు తెలుస్తోంది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటనపై స్థానికులు తీవ్రమైన ఆగ్రహానికి గురై ఆందోళనకు దిగారు. రాజును తమకు అప్పగించాలని పోలీసులపై దాడి చేశారు. పాప తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా నుంచి వలస వచ్చి సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారు. 

స్థానికులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడిచేశారు దాంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. 300 మంది పోలీసులతో కాలనీలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ చౌహాన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

నిందితుడు రాజూ నాయక్ నల్లగొండ జిల్లా చందంపేట మండలానికి చెందినవాడు. అతను హైదరాబాదులో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సంఘటనను నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. రాజు నాయక్ పోలీసు కస్టడీలోనే ఉన్నాడని, అతన్ని తమకు అప్పగించాలని స్థానికులు అంటున్నారు. రాజూ నాయక్ బాధిత కుటుంబం ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాడు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే