
అమీర్ పేట : మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై gang rapeకి పాల్పడ్డారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్ స్పెక్టర్ సైదులు తెలిపారు. బోరబండ ప్రాంతంలోని ఓ బస్తీకి చెందిన minor girl (17) ఇది చెత్త ఏరుకునే జీవించి పేద కుటుంబం. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో milk packet తీసుకు వచ్చేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్ళింది.
ఈ సమయంలో అదే బస్తీకి చెందిన శివ (22) బాలికకు ఏవో మాయమాటలు చెప్పి.. సమీపంలోని మరో బస్తీలో ఉండే కార్మికుడిగా పనిచేస్తున్న మిత్రుడు స్థాయి (20) గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఉదయం నాలుగు గంటలకు వారినుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్ళి తల్లికి విషయం చెప్పింది. ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారిపై పోక్సో, అత్యాచారం, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
కాగా, మరో కథనంప్రకారం...
ఆ బాలిక రోజులాగే పాల ప్యాకెట్ కోసం పాల బూత్ కి వెళ్ళింది. రాత్రి పూట అయినా.. ఆ మధ్యలోనే ఓ మద్యం దుకాణం ఉందని తెలిసినా.. రోజూ నడిచే దారే కదా అనే ధైర్యంతో వెళ్ళింది. కాని ఆరోజు మాత్రం ఘోరం జరిగిపోయింది. చిత్తుగా మద్యం తాగిన ఇద్దరు దుర్మార్గులు దారుణానికి ఒడిగట్టారు. బాలికను ఎత్తుకెళ్లి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ నగర్ కాకతీయ సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది.
జూబ్లీహిల్స్ పెద్దమ్మ నగర్ కు చెందిన బాలిక (15).. రాత్రివేళ పాల ప్యాకెట్ కోసం పీజేఆర్ గ్రౌండ్ సమీపంలోని ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న పాల బూత్ కు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బోరబండ చెందిన శివ, మద్యం దుకాణం పక్కనే ఉంటున్న సాయిలు కంటపడింది. ఇద్దరూ అప్పుడే చిత్తుగా మద్యం తాగి దుకాణం నుంచి బయటకు వచ్చారు. బాలికను అడ్డగించారు. తమతో రావాలంటూ బలవంతపెట్టారు. అందుకు ఒప్పుకోక పోవడంతో.. ఆ దగ్గర్లోనే ఉన్న సాయిలు గదికి బలవంతంగా లాక్కెళ్ళి పోయారు.
అక్కడ.. ఆ ఇద్దరూ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఎలాగో వారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులకు విషయం చెప్పి వారితో కలిసి ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.