
దేశ విచ్ఛినకర శక్తులతో తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) ప్రయాణం ప్రమాకరమని బీజేపీ (bjp) సీనియర్ నాయకుడు మురళీధర్ రావు (muralidhar rao) అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదివారం మాహారాష్ట్రలో పర్యటించారని ఆయన చెప్పారు. ఆ పర్యటన వల్ల రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉంటే వెల్లడించాలని అన్నారు.
మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ వెంట సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (prakash raj) ఎందుకు ఉన్నారని మురళీధర్ రావు ప్రశ్నించారు. ఆయనతో కలిసి సీఎం నడవడం వెనక ఏ ఉద్దేశం ఉందని అడిగారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని ఆయన అన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇతర రాష్ట్రాలలో సీఎం కేసీఆర్ తిరుగుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు ఏమైనా సీఎం కేసీఆర్ స్పందిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే అలాంటి వ్యక్తులతో కలిసి నడిస్తే ఒంటిరిగా మిగిలిపోతారని హెచ్చరించారు. గతంలోనూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేశారని మురళీధర్ రావు అన్నారు. అయితే ఆ ప్రయత్నాలు ఏమయ్యాయో అందరికీ తెలుసని అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీలు సంతోష్ రావు (santhosh rao), బీబీ పాటిల్ (b b patil), రంజిత్ రెడ్డి (ranjith reddy), ఎమ్మెల్సీలు కవిత (kavitha), పల్లా రాజేశ్వర్ రెడ్డి (palla rajeshwar reddy)లు ఆదివారం ఉదయం మహారాష్ట్ర వెళ్లారు. అక్కడ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే (uddhav thackeray), ఎన్ సీపీ (ncp) అధినేత శరాద్ పవర్ (sharad pawar) ను కలుసుకున్నారు. అయితే తెలంగాణ నుంచి వెళ్లిన బృందాన్ని రిసీవ్ చేసుకునేందుకు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వచ్చారు. అంత వరకు ఆయన వస్తున్నట్టు ఎవరికీ తెలియదు. షెడ్యూల్ లో కూడా ఈ విషయం ఎక్కడా లేదు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్ సీపీ అధినేత శరాద్ పవర్ తో చర్చిస్తున్న సమయంలోనూ ప్రకాశ్ రాజ్ వారి వెంటే ఉన్నారు. సమావేశం ముగిసిన అనంతరం వారికి వీడ్కోలు కూడా పలిచారు. అయితే ఈ పర్యటనలో అనుకోని అతిథిగా ప్రకాశ్ రాజ్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది తెలంగాణ తో పాటు దేశ రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది.
తెలుగు రాష్ట్రాల ప్రజలక ప్రకాశ్ రాజ్ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. తెలుగుతో పాటు కోలివుడ్, బాలీవుడ్ లోనూ ఆయన నటిస్తుంటారు. అయితే ఆయన మొదటి నుంచీ బీజేపీ, ప్రధాన మంత్రి మోదీ వ్యతిరేకంగా బలంగా వాయిస్ వినిపిస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌తో మాత్రం ఆయనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. పలు టీవీ డిబెట్లలో టీఆర్ఎస్ తరుఫున మాట్లాడారు. సీఎం కేసీఆర్ ను పలు మార్లు బహిరంగంగానే పొగిడారు. ఇటీవల మా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.