ఒడిశా బీఆర్ఎస్ అధ్యక్షునిగా గిరిధర్ గమాంగ్..

Published : Jan 14, 2023, 09:13 AM IST
ఒడిశా బీఆర్ఎస్ అధ్యక్షునిగా గిరిధర్ గమాంగ్..

సారాంశం

బీఆర్ఎస్ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిగా గిరిధర్ గమాంగ్ ను నియమించనున్నట్లు సమాచారం. శుక్రవారం గిరిధర్ గమాంగ్ తన కొడుకు శిశిర్ గమాంగ్ తో కలిసి హైదరాబాద్ కు వచ్చారు. 

హైదరాబాద్ : బీఆర్ఎస్ గా మారిన టిఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను నియమిస్తోంది. ఈ క్రమంలోనే  ఒడిశా రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఒడిశా మాజీ ముఖ్యమంత్రి,  మాజీ ఎంపీ గిరిధర్ గమాంగ్ ను నియమించాలని బీఆర్ఎస్  అధ్యక్షుడు కెసిఆర్ నిర్ణయించారు. త్వరలోనే ఒడిశా రాష్ట్రంలో పార్టీ రైతు విభాగాన్ని, బీఆర్ఎస్ రాష్ట్రశాఖను ప్రారంభించనున్నారు. శుక్రవారం గిరిధర్ గమాంగ్ తన కుమారుడు శిషిర్ గమాంగ్ తో  కలిసి  హైదరాబాద్ వచ్చారు. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇద్దరు భేటీ అయ్యారు.

తండ్రి కొడుకులు గిరిధర్ గమాంగ్,  శిషిర్ గమాంగ్ లు బీఆర్ఎస్ లో చేరడానికి సుముకత వ్యక్తం చేసినట్టు సమాచారం.  ఒడిశా రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని గిరిధర్ గమాంగ్ ను  కెసిఆర్  కోరారు. దీనికి ఆయన సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీలో తన కుమారుడికి కూడా ప్రాధాన్యత ఉన్న పదవి కావాలని ఆయన కోరినట్లు  సమాచారం. బిజెపికి ప్రత్యామ్నాయంగా  టిఆర్ఎస్ వంటి జాతీయ పార్టీ అవసరం ఉందని గమాంగ్ ఈ సందర్భంగా అన్నారు. 

తల్లిని రాడ్డుతో కొట్టి, టూవీలర్ ఎక్కించి చంపి.. తలను గోడకు కొట్టుకుని కొడుకు ఆత్మహత్య..

సుదీర్ఘ రాజకీయ అనుభవం..  పలు పదవీ బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం అభినందనించదగిన విషయమని గమాంగ్  అన్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న ఖమ్మంలో జరిగే టిఆర్ఎస్ ఆవిర్భావ సభ సందర్భంగా ఒడిశా తో పాటు..  పలు రాష్ట్రాల అధ్యక్షులు..  రైతు విభాగాల అధ్యక్షుల పేర్లను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గమాంగ్ 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా  కోరాపుట్ నుంచి లోక్సభకు  తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆయన వయసు 79 ఏళ్ళు. 

ఆ తర్వాత  ఎంపీగా వరుసగా ఎనిమిది సార్లు గెలిచారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 6 వరకు ఎంపీగా ఉంటూనే ఒడిశా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అదే ఏడాది ఏప్రిల్ 17న కేంద్రంలోని వాజ్పేయి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. గమాంగ్ ఎంపీగా వ్యతిరేకంగా ఓటు వేశారు.  దీంతో ఆ  ప్రభుత్వం కూలిపోయింది. 2009 ఎన్నికల్లో  గమాంగ్  ఓడిపోయాడు.  ఆ తరువాత గమాంగ్ కాంగ్రెస్ కు దూరమయ్యారు. 2015లో బీజేపీలో చేరారు. కొన్నాళ్లకు ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?
Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా