హైదరాబాద్‌లో కుండపోత వర్షం: బయటకు రావొద్దు.. ప్రజలకు జీహెచ్ఎంసీ హెచ్చరిక

Siva Kodati |  
Published : Sep 25, 2021, 08:12 PM IST
హైదరాబాద్‌లో కుండపోత వర్షం: బయటకు రావొద్దు.. ప్రజలకు జీహెచ్ఎంసీ హెచ్చరిక

సారాంశం

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, ఖైరతాబాద్, కోఠి, దిల్‌సుఖ్ నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఆల్విన్ కాలనీ, బాలానగర్, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఉప్పల్‌‌లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, డ్రైనేజీలు, నాళాలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వర్షం అలాగే కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో బయటకు రావొద్దని ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి  చేశారు. 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!