గాంధీ భవన్‌లో టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ: తొలిసారి సీనియర్ల రాక, కోమటిరెడ్డి బ్రదర్స్ డుమ్మా

By Siva KodatiFirst Published Sep 25, 2021, 6:27 PM IST
Highlights

గాంధీ భవన్‌లో టీ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ అయ్యింది. ఈ కమిటీ ఏర్పాటయ్యాక తొలిసారి ఈ సమావేశం జరుగుతోంది. దీనికి ఏఐసీసీ నుంచి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, బోసు రాజు, శ్రీనివాస్ హాజరయ్యారు. కొత్త పీసీసీ ఏర్పాటయ్యాక కొంతదూరం పాటించిన సీనియర్లు సైతం నేటి సమావేశానికి హాజరయ్యారు.

గాంధీ భవన్‌లో టీ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ అయ్యింది. ఈ కమిటీ ఏర్పాటయ్యాక తొలిసారి ఈ సమావేశం జరుగుతోంది. దీనికి ఏఐసీసీ నుంచి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, బోసు రాజు, శ్రీనివాస్ హాజరయ్యారు. కొత్త పీసీసీ ఏర్పాటయ్యాక కొంతదూరం పాటించిన సీనియర్లు సైతం నేటి సమావేశానికి హాజరయ్యారు. మాజీ మంత్రి జానారెడ్డి సైతం సమావేశానికి వచ్చారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం ఇంత వరకు గాంధీ భవన్‌కు రాలేదు. 

అంతకుముందు టీపీసీసీలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యల దుమారానికి తెరపడింది. తాము అన్నదమ్ముల్లాంటి వారమని , కలిసి మాట్లాడుకుంటాం, కలిసి పనిచేస్తామని జగ్గారెడ్డి చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలు మీడియాతో మాట్లాడొద్దని హైకమాండ్ చెప్పిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పానని జగ్గారెడ్డి చెప్పారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని జగ్గారెడ్డి తెలిపారు. అటు మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. నిన్నటి వివాదానికి కమ్యూనికేషన్ గ్యాపే కారణమని చెప్పారు. 

కాగా, నిన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Tpcc chief Revanth Reddy) పై జగ్గారెడ్డి (Jagga Reddy) సీరియస్ అయ్యారు. పార్టీ సీనియర్ నేతల మధ్య జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి తీరుపై ఆవేశంతో ఊగిపోయారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గాను సీఎల్పీ సమావేశానికి ముందు పార్టీ సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగ్గారెడ్డి  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు.

ఇది కాంగ్రెస్ పార్టీయా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా అని ప్రశ్నించారు. పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రెండు మాసాల కార్యాచరణను ఎలా ప్రకటిస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ విషయంలో గీతారెడ్డికి సమాచారం ఇవ్వరా? అని ఆయన అడిగారు. సంగారెడ్డికి వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నాకే సమాచారం ఇవ్వరా? అని ఆయన అడిగారు. కనీసం ప్రోటోకాల్ పాటించాలి కదా అని అడిగారు.

click me!