తెలంగాణలో భానుడి భగభగలు: ఆదిలాబాద్‌లో రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు

By narsimha lode  |  First Published Mar 30, 2024, 8:37 AM IST


తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  పెరిగిన ఉష్ణోగ్రతలతో  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో  గత రెండు రోజులుగా  అత్యధిక ఉష్ణోగ్రతలు  రికార్డయ్యాయి. గత రెండు రోజులుగా ఆదిలాబాద్ లో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో  ప్రజలు ఎక్కువగా ఇంటి పట్టునే ఉంటున్నారు.  ఉదయం లేదా సాయంత్రం పూట అత్యవసర పనులుంటేనే ఇళ్ల నుండి ప్రజలు బయటకు వెళ్తున్నారు. 

రానున్న రోజుల్లో  ఉష్ణోగ్రతలు  మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు  46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు  చెబుతున్నారు.

Latest Videos

undefined

మరో వైపు హైద్రాబాద్ లో కూడ భారీగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.  శుక్రవారం నాడు  హైద్రాబాద్ లో  40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది.
2016 మార్చి మాసంలో  40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  2016 మార్చి  19న హైద్రాబాద్ లో  41.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది.

హైద్రాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో 42.3 డిగ్రీలు,శేరిలింగంపల్లిలో  41.9 డిగ్రీలు,బోరబండలో 41.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.రానున్న ఐదు రోజుల పాటు  ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరో వైపు ఈ నెల  29న  నిర్మల్ లో 43.1 డిగ్రీలు, కొత్తగూడెంలో  42.9 డిగ్రీలు,  ఆసిఫాబాద్ లో  42.5 డిగ్రీలు, నల్గొండలో  42.4, ఆదిలాబాద్ లో 42.3 హైద్రాబాద్ లో  41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్,  సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ , మంచిర్యాల సహా  13 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.ఇదిలా ఉంటే 2023 మార్చి 28న రాష్ట్రంలోని  ఆరు జిల్లాల్లో 40 డిగ్రీలు దాటాయి ఉష్ణోగ్రతలు.ఈ ఏడాది  మాత్రం  32 జిల్లాల్లో  ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.


 

click me!