సీఎం దొర మాస్టర్ ప్లాన్ అదిరింది.. విజయశాంతి

Bukka Sumabala   | Asianet News
Published : Nov 27, 2020, 11:24 AM IST
సీఎం దొర మాస్టర్ ప్లాన్ అదిరింది.. విజయశాంతి

సారాంశం

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారంటూ కేసీఆర్ పై కాంగ్రెస్ నేత విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. ఎంఐఎంతో కలిసి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారంటూ కేసీఆర్ పై కాంగ్రెస్ నేత విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. ఎంఐఎంతో కలిసి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. 

‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గారు ఎంఐఎం పార్టీతో కలసి కుట్రలు చేసి ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను చివరి క్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. 

ఎంఐఎం నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే దానిని కట్టడి చెయ్యకపోగా ఎంఐఎం దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారని వార్తలు వస్తున్నాయి.

ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చెయ్యడం లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్ గారికి అలవాటుగా మారింది. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవని నిర్ణయానికి రావడంతో ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కుట్రలకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం సహించదు... క్షమించదు’’ అని విజయశాంతి పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Jeevan Reddy: సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు| Asianet News Telugu
Rain Alert: ఇది క‌దా కూల్ న్యూస్ అంటే.. వ‌చ్చే వారం రోజులు వ‌ర్షాలు, ఎండ నుంచి బిగ్ రిలీఫ్