జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ, పలు చోట్ల ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Dec 1, 2020, 3:17 PM IST
Highlights

 జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. రాం‌నగర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. 

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. రాం‌నగర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. 

రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు గొడవకు దిగారు. ఇరువురు కార్యకర్తలు చొక్కాలు పట్టుకొని కొట్టుకొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.  నాచారం ఆరో డివిజన్ లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.

also read:జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: మాజీ ఎంపీ మల్లు రవి ఓటు గల్లంతు

తన ఇంటిపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి ఆరోపించారు. వారాసీగూడలో కూడ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. డిప్యూటీ స్పీకర్ తనయుడు కిరణ్  బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
 

click me!