కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితకు బిజెపి వరుస షాక్ లు

By telugu teamFirst Published Dec 4, 2020, 6:25 PM IST
Highlights

జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కేసీఆర్ తనయ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిజెపి షాక్ ఇచ్చింది. ఆమె బాధ్యతలు తీసుకున్న గాంధీనగర్ డివిజన్ లో బిజెపి విజయం సాధించింది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవితకు బిజెపి వరుస షాక్ లు ఇస్తోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బిజెపి ఆమెకు షాక్ ఇచ్చింది. గాంధీనగర్ డివిజన్ లో బిజెపి విజయం సాధించింది. దీంతో కవితకు చేదు అనుభవం ఎదురైంది.

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గాంధీనగర్ డివిజన్ ను బాధ్యతలను కవిత తీసుకున్నారు. ఆమె గాంధీనగర్ డివిజన్ లో విస్తృతంగా ప్రచారం సాగించారు అయినప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇది కవితకు బిజెపి నుంచి తగిలిన మరో దెబ్బ.

నిజామాబాద్ లోకసభ ఎన్నికల్లో బిజెపి కవితను ఓడించింది. లోకసభ ఎన్నికల్లో బిజెపి నేత ధర్మపురి అరవింద్ కవితను ఓడించారు. దాంతో ఆమె చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. 

కొన్ని చోట్లు టీఆర్ఎస్ ప్రముఖుుల ఓటమి పాలయ్యారు. ముషీరాబాద్ లో మాజీ హోం మంత్రి, దివంగత నేత నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 

click me!