కేటీఆర్ తో యాంకర్ సుమ భేటీ: ట్విట్టర్ లో ప్రశంసల జల్లు

Published : Nov 21, 2020, 02:25 PM ISTUpdated : Nov 21, 2020, 02:26 PM IST
కేటీఆర్ తో యాంకర్ సుమ భేటీ: ట్విట్టర్ లో ప్రశంసల జల్లు

సారాంశం

జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రముఖ యాంకర్ సుమ తెలంగాణ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. అంతేకాకుండా భేటీ ఫొటోను జత చేస్తూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మీద ప్రశంసల జల్లు కురిపించారు.

హైదరాబాద్: యాంకర్ సుమ తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావును కలిశారు. తాను కేటీఆర్ ను కలిసిన ఫొటోను జత చేస్తూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. "మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా నా షోల్లో నాన్ స్టాప్ గా ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాను. కానీ నాయకత్వ హోదాలో మీరు మాట్లాడే విధానం వినడానికి ఎంతో విలువైందిగా ఉంటుంది" అని సుమ కేటీఆర్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

మీ నిబ్దధత, మీరు మాట్లాడే విధానం అద్భుతమని ఆమె కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు. అయిే, సుమ ట్వీట్ మీద నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సుమ భేటీ కావడం కేటీఆర్ లక్ అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తారా అని మరికొంత మంది సుమను అడుగుతున్నారు. 

 

కొన్ని దశాబ్దాలుగా సుమ తన మాటల మాయజాలంతో బుల్లితెరలో వినోదం పంచుతున్న విషయం తెలిసిందే. మిగతా యాంకర్లకు భిన్నంగా నిండుగా దుస్తులు ధరించి, అసభ్య పదజాలం వాడుకుండా హాస్యాన్ని పండిస్తూ ఆమె ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. మిగతా యాంకర్లకు భిన్నంగా ఉంటూ తనదైన ప్రత్యేకతను నిలుకున్నారు. 

సుమ ఇటీ సుమక్క పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించారు .ఇక్కడ కూడా తన వాక్చాతుర్యంతో ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వినోద పరిశ్రమ నుంచి కేటీఆర్ టీఆర్ఎస్ కు మద్దతు కూడగడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సినీ నటుడు పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్