జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఓటర్ల జాబితా తయారీకి రంగం సిద్ధం

By Siva KodatiFirst Published Oct 31, 2020, 7:43 PM IST
Highlights

గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. 

గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది.  నవంబర్‌ 7న జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన చేయనున్నట్లు ప్రకటించింది.

ఎన్నికలకు సంబందించి పురపాలక, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, కమిషనర్లు అరవింద్‌ కుమార్‌, లోకేశ్‌కుమార్‌లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) పార్థసారథి శనివారం సమావేశమయ్యారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నద్ధతపై వారితో చర్చించారు. ఎన్నికల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించాలని ఎస్ఈసీ సూచించారు. పకడ్బందీగా ఓటర్ల జాబితా తయారు చేయాలని ఎస్‌ఈసీ అధికారులను ఆదేశించారు.  

ఓటర్ల జాబితా షెడ్యూల్‌ :

నవంబర్‌ 9న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, 10న సర్కిళ్ల వారీగా డిప్యూటీ కమిషనర్లు పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. నవంబర్‌ 11 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనునున్నారు. నవంబర్‌ 13న తుది జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనలో వెల్లడించింది.  
 

click me!