జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్... బిజెపి ఏజెంట్లతో బండి సంజయ్ సమావేశం

By Arun Kumar PFirst Published Dec 3, 2020, 3:17 PM IST
Highlights

హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ముఖ్యమైన పోలింగ్ ఘట్టం మంగళవారం ముగియగా ఉత్కంఠభరితమైన కౌటింగ్ ప్రక్రియ శుక్రవారం జరగనుంది. 

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి రేపు(శుక్రవారం) జరగనున్న కౌంటింగ్ లో ఎలా వ్యవహరించాలన్న దానిపై ముందుగానే అప్రమత్తమైంది. కౌటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించనున్న పార్టీ ఏజెంట్లతో తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సలహాలు, సూచనలిచ్చారు సంజయ్. 

హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ముఖ్యమైన పోలింగ్ ఘట్టం మంగళవారం ముగియగా ఉత్కంఠభరితమైన కౌటింగ్ ప్రక్రియ శుక్రవారం జరగనుంది. ఎన్నికల్లో ఓట్లేయడానికి నగర ప్రజలు అంతగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ మందకోడిగా సాగింది. దీంతో నగరవ్యాప్తంగా మొత్తం పోలింగ్ శాతం కేవలం 46.60గా మాత్రమే నమోదయ్యింది. ఇలా తక్కువ ఓటింగ్ శాతం నమోదవడం ఎవరికి అనుకూలిస్తుందో చూడాలి. 

read more బల్దియా ఎన్నికలు : ఎక్స్ అఫీషియో ఓటుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..

డివిజన్ల వారిగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే చూసుకుంటే  అత్యధికంగా ఆర్సీపురంలో 67.71శాతం జరిగింది. ఇక మెహదీపట్నంలో అత్యల్పంగా 34.41 శాతం పోలింగ్ నమోదయ్యింది. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 7412601 మంది ఓటర్లుండగా తాజా ఎన్నికల్లో 3454552మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధిక పోలింగ్ శాతం నమోదయిన మెహదీపట్నం ఫలితమే మొదట వెలువడే అవకాశాలున్నాయి.

ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గిన నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌‌పై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... పోలింగ్ శాతం తగ్గినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా విద్వేషాలు జరుగుతాయని చెప్పడం వల్లే ఓటింగ్‌ శాతం తగ్గిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.  

click me!