ఘర్ ఘర్ జిఐ .. కొత్త సంప్రదాయానికి శ్రీకారం.. చిన్న కళాకారులకు ప్రోత్సాహం

By Mahesh KFirst Published Sep 2, 2022, 8:59 PM IST
Highlights

జియోగ్రఫికల్ ఇండికేషన్ ద్వారా చేనేతకారులు, హ్యాండ్‌క్రాఫ్ట్ కళాకారులకు ప్రోత్సహించాలని ఘర్ ఘర్ జియోగ్రఫికల్ ఇండికేషన్ క్యాంపెయిన్ ముందుకు వచ్చింది. రానున్న పండుగ సీజన్‌లో జీఐ ఉన్న వస్తువులను బహుమానం చేసుకుని కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని కొత్త పిలుపులు వస్తున్నాయి.

హైదరాబాద్: భారత దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపు అందుకుని దేశ ప్రజలు అందరూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేశారు. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు కొత్త నినాదం వినిపిస్తున్నది. అదే ఘర్ ఘర్ జీఐ (జియోగ్రఫికల్ ఇండికేషన్). జియోగ్రఫికల్ ఇండికేషన్ ఒక వస్తువు ప్రత్యేకతను తెలుపుతుంది. దాని గుర్తింపును స్పష్టం చేస్తుంది. ఈ ఇండికేషన్ ద్వారా ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత సంతరిస్తుంది. అందుకే ఇప్పుడు కొందరు జియోగ్రఫికల్ ఇండికేషన్ పై ఆసక్తి చూపుతున్నారు.

ముఖ్యంగా కళాకారులు, చేనేతకారులకు ఈ గుర్తింపు ఎంతో కలిసి వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న కళాకారులను ప్రోత్సహించడానికి ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉపకరిస్తుంది. అందుకే ఘర్ ఘర్ జియోగ్రఫికల్ ఇండికేషన్ క్యాంపెయిన్ ద్వారా రానున్న పండుగ వేళ జియోగ్రఫికల్ ఇండికేషన్ వస్తువులను బహుమానంగా ఇచ్చి నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని, తద్వార చిన్న కళాకారులను ప్రోత్సహించాలని రిజల్యూట్ గ్రూప్ ఎండీ రమిందర్ సింగ్ సోయిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. R4IP అనే సంస్థ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రధాన లక్ష్యంతో స్థాపించారని తెలిపారు.

మన దేశంలో 400కు పైగా జియో ఇండికేషన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రజలు ఇందులో వేటినైనా తమ మిత్రులకు బహుమానంగా ఇవ్వవచ్చు. టెక్స్‌టైల్స్, హ్యాండ్‌క్రాఫ్ట్‌లకు ప్రోత్సహించే ఈ క్యాంపెయిన్‌ను స్వాగతించాలని కోరుతున్నారు. తెలంగాణలో 15 జీఐ రిజిస్టర్డ్ ప్రోడక్టులు ఉన్నాయి. మరికొన్ని గుర్తింపు ప్రక్రియలో ఉన్నాయి. ఇటీవలే స్వామి శివానందకు 125 ఏళ్ల చేరియాల్ పెయింటింగ్‌ను హైటెక్స్‌లో గత నెల 28న అందించారు. ఈ పెయింటింగ్ తెలంగాణలో జీఐ పొంది ఉండటం గమనార్హం.

click me!