మానకొండూరులో ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీ ప్రారంభించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Published : Sep 02, 2022, 08:35 PM IST
మానకొండూరులో ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీ ప్రారంభించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

సారాంశం

మానకొండూరులో ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. తెలంగాణ వచ్చిన ప్రజల గోసలు అలాగే ఉన్నాయని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా మిగిలిందని, అది కేవలం తండ్రీ కొడుకుల పార్టీ అని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ రసమయి నియోజకవర్గానికి నిధుల్లేవని అన్నారు.  

హైదరాబాద్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో చెరువు కట్ట దగ్గర ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏ లక్ష్యాల కోసమైతే తెలంగాణను   కొట్లాడి సాధించుకున్నామో అవి ఇంకా నెరవేరలేదని వివరించారు. రాష్ట్రంలో తండ్రీ కొడుకుల అరాచక పాలన సాగుతున్నదని విమర్శించారు. 

రాష్ట్ర ప్రభుత్వం అన్నీ గొప్పగొప్పగా చెబుతూ పథకాలు ప్రకటిస్తున్నదని, కానీ, క్షేత్రస్థాయిలో వాటి ఫలితాలు కనిపించడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఏం చేయలేదు కాబట్టే.. ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పలేక సీఎం వేరే రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడని ఆరోపించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపణలు చేశారు.

నిజానికి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు.. టీఆర్ఎస్ పార్టీలా లేదని అన్నారు. ఇప్పుడిది తండ్రీ కొడుకుల పార్టీ అని విమర్శించారు. కేవలం వారి నియోజకవర్గాల్లోనే అభివృద్ధి కనిపిస్తున్నదని, వేరే నియోజకవర్గాల్లో ఆ అభివృద్ధి లేదని తెలిపారు. కుటుంబ సభ్యులకే నిధులు ఇస్తారా? వేరే ఎమ్మెల్యేలకు ఇవ్వరా? అని నిలదీశారు. మానకొండూరు ఎమ్మెల్యే కూడా రసమయి బాలకిషన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కదా.. అయినా.. అభివృద్ధి లేదని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా రసమయికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 

సీఎం కేసీఆర్ మాటలు విని కరీంనగర్ చాలా అభివృద్ధి అయిందని అనుకున్నారని, కానీ, అదేమీ లేదని అన్నారు. దమ్ముంటే రసమయి రాజీనామా చేసి ఉప ఎన్నిక ద్వారా మానకొండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకు కూడా నిధులు ఇవ్వనప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలా దమ్ముంటే రసమయి బాలకిషన్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు