డాక్టర్ వసంత్ ఆరోపణలు: ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న గాంధీ ఆసుపత్రి

By Siva KodatiFirst Published Feb 14, 2020, 5:37 PM IST
Highlights

గాంధీ ఆసుపత్రిలో వైద్యుల మధ్య తలెత్తిన వివాదాలకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు హాస్పిటల్ సూపరింటెండెంట్ నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే డాక్టర్ వసంత్ గాంధీ ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్‌పై పలు ఆరోపణలు చేశారు. 

గాంధీ ఆసుపత్రిలో వైద్యుల మధ్య తలెత్తిన వివాదాలకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు హాస్పిటల్ సూపరింటెండెంట్ నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే డాక్టర్ వసంత్ గాంధీ ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్‌పై పలు ఆరోపణలు చేశారు.

ఇంటర్న్‌షిప్ చేయకున్నా లంచం తీసుకుని పలువురికి సర్టిఫికేట్లు ఇచ్చారని ఆరోపించారు. మరోవైపు శుక్రవారం మీడియాను, ఇతరులను అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వైపు రాకుండా ఓ గదిలో డాక్యుమెంట్లను మారుస్తున్నారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: గాంధీ ఆసుపత్రి ఎదుట డాక్టర్ వసంత్ హైడ్రామా, అరెస్ట్

అయితే డీఎంఈకి నివేదిక ఇచ్చేందుకే రిపోర్టులు తయారు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. డీఎంఈ ఆదేశాల ప్రకారం డాక్యుమెంట్లను సీరియల్ ఆధారంగా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. డాక్యుమెంటేషన్ చేయడం కోసమే పాత రికార్డులను బయటకు తీసినట్లు శ్రావణ్ తెలిపారు. 

కరోనా వైరస్ పాజిటివ్  కేసు నమోదైందని తప్పుడు సమాచారం ఇచ్చారని పనిష్మెంట్‌కు గురైన వసంత్ గాంధీ ఆసుపత్రి ఎదుట మంగళవారం నాడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గంట తర్వాత పోలీసులు అతడిని సురక్షితంగా అక్కడి నుండి తరలించారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: తప్పుడు ప్రచారం, గాంధీ‌ ఆసుపత్రిలో డాక్టర్‌పై వేటు

గాంధీ ఆసుపత్రిలో  రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా  తప్పుడు సమాచారాన్ని మీడియాకు ఇచ్చారనే ఆరోపణలతో  డాక్టర్ వసంత్‌పై సోమవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకొంది. డాక్టర్ వసంత్‌ను డైరెక్టర్ ఆప్ హెల్త్‌కు సరెండర్ చేసిన సంగతి తెలిసిందే. 

click me!