గజ్వేల్‌‌లో‌ ఓట్లలెక్కింపు అలా జరగాలి...అందుకోసం హైకోర్టుకు వెళతా: వంటేరు

By Arun Kumar PFirst Published Dec 8, 2018, 5:05 PM IST
Highlights

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో గజ్వేల్ ఒకటి. ఈ నియోజకవర్గం నుండి ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయడమే అందుకు కారణం. అయితే కేసీఆర్ గెలుపు కోసం ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగే అవకాశం ఉందని...ఈవీఎం మిషన్లను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ఓ టీవి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భయాందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎం లోని ఓట్లతో పాటు వివిపాట్ లోని ఓటర్ రశీదులను కూడా లెక్కించాలని వంటేరు  డిమాండ్ చేస్తున్నారు. 

తన డిమాండ్ ను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లినట్లు... వారు స్పందించకుంటే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వంటేరు తెలిపారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు కానీ వివిపాట్ లను ఏం చేయలేరు కాబట్టే తానీ డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియకోసం అయ్యే ఖర్చును భరించడానికి తాను సిద్దంగా ఉన్నానని వంటేరు పేర్కొన్నారు. 

అలాగే ఈవీఎంలు భద్ర పరిచే స్ట్రాంగ్ రూంల వద్ద తాను, తన ప్రతినిధులకు కాపలా ఉండేలా ఈసి, పోలీసుల నుండి అనుమతి తీసుకున్నామని తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు తమ స్ట్రాంగ్ రూంల వద్ద కాపలా కొనసాగుతుందని వంటేరు తెలిపారు.  

మరిన్ని వార్తలు

కేసీఆర్ పై 50 వేల మెజారిటీతో గెలుస్తా: వంటేరు ధీమా
 
click me!