జమున రెడ్డిని హుజురాబాద్ లో తిరగనివ్వం... ఈటలను ఓడించి తీరతాం: గజ్జెల కాంతం హెచ్చరిక (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jul 29, 2021, 05:02 PM IST
జమున రెడ్డిని హుజురాబాద్ లో తిరగనివ్వం... ఈటలను ఓడించి తీరతాం: గజ్జెల కాంతం హెచ్చరిక (వీడియో)

సారాంశం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బామ్మర్ది మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆగస్టు 4న జమ్మికుంటలో నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రజా సంఘాల జేఎసి నాయకులు గజ్జెల కాంతం ప్రకటించారు. 

కరీంనగర్: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాల జెఎసి నాయకులు గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. మధుసుధన్ రెడ్డి వాట్సాప్ లో కులం పేరుతో దళితులపై అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని... బిజెపి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గజ్జెల కాంతం తెలిపారు. 

వీడియో

మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆగస్టు 4న జమ్మికుంట లో నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈటల జమున రెడ్డి, ఆమె సోదరుడు మధుసూదన్ రెడ్డి ని హుజురాబాద్ లో తిరగనివ్వబోమని గజ్జల కాంతం హెచ్చరించారు.

read more  ఈటల బామ్మర్ది వాట్సాప్ చాట్ వివాదం... రెండుగా చీలిన దళితులు, పోటాపోటీ నిరసనలు (వీడియో)

గురువారం కరీంనగర్ లో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రజాసంఘాల జెఎసిని ఎందుకు ఆహ్వానించలేదని కాంతం ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక నాయకులు హుజురాబాద్ ఉపఎన్నికలో పరోక్షంగా బిజెపికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. 

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకాన్ని గజ్జెల కాంతం అభినందించారు. హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపిని ఓడించి దళితుల సత్తా చూపిస్తామన్నారు. ఆగస్టు 28న అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో హుజురాబాద్ లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్లు గజ్జెల కాంతం ప్రకటించారు. 


 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే