రాజకీయ శక్తిగా ఎదగాలి: ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్షకు గద్దర్ మద్దతు

By narsimha lode  |  First Published Apr 26, 2023, 2:13 PM IST


టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ ను  నిరసిస్తూ  బుధవారంనాడు ఇందిరా పార్క్ వద్ద  దీక్షను నిర్వహించారు. ఈ దీక్షకు  గద్దర్  మద్దతు ప్రకటించారు. 


హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ ను  నిరసిస్తూ  టీ సేవ్ సంస్థ  ఆధ్వర్యంలో  బుధవారంనాడు  ఇందిరాపార్క్  వద్ద  దీక్షను చేపట్టారు. వైఎస్ఆర్‌టీపీ  చీఫ్ వైఎస్ షర్మిల దీక్షలో  కూర్చున్నారు. మరో వైపు ఈ దీక్షకు  ప్రజా గాయకుడు గద్దుర్ మద్దతిచ్చారు. 

ఇందిరాసార్క్ వద్ద  టీ-సేవ్ దీక్షకు  పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో  తెలంగాణ హైకోర్టును  ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు  ఈ దీక్షకు అనుమతిని ఇచ్చింది.   దీంతో  ఇవాళ  దీక్షను నిర్వహిస్తున్నారు.   దీక్షకు మద్దతు ప్రకటించిన గద్దర్  దీక్షనుద్దేశించి  ప్రసంగించారు. 

Latest Videos

గ్రామాలకు వెళ్లి  ఓట్ల విప్లవానికి   సిద్దం కావాలని గద్దర్  సూచించారు. . డబ్బుతో గెలుస్తామనే  నమ్మకంతో కేసీఆర్ ఉన్నారన్నారు.    వైఎస్ షర్మిల రాజకీయ శక్తిగా ఎదగాలని గద్దర్ ఆకాంక్షను వ్యక్తం  చేశారు. గ్రామస్థాయిలో  పునాదులు పటిష్టం చేసుకోవాలని  గద్దర్  వైఎస్ షర్మిలకు  సూచించారు. 

యువతకు ఉద్యోగాల కోసమే షర్మిల పోరాటాలు మొదలుపెట్టిందన్నారు. 
విద్యార్థులు ఆడుకునే బాల్య దశ ఏడుపుతోనే మొదలైందని గద్దర్  చెప్పారు. పదో తరగతి వరకు గ్రేడులు, ట్యూషన్లతో ఆడుకునే దశ కన్నీళ్లతో కలిసిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం  చేశారు.  ఇంటర్ పూర్తి కాగానే  భవిష్యత్తులో ఏం చేస్తావని ప్రశ్నలు. వస్తున్నాయన్నారు. 

18 ఏళ్ల నుంచి నిజమైన జీవితం ప్రారంభమవుతుందని గద్దర్  చెప్పారు..ఏ దేశంలో చూసినా యువశక్తిని వాడుకొని ఎదుగుతుంటే మన దేశంలో మాత్రం యువతకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాదని గద్దర్  విమర్శించారు. 

 ఆత్మ రక్షణ కోసమే పోలీసులను  తోసేశానని షర్మిల వ్యాఖ్యలను  ఆయన గుర్తు  చేశారు.  పోలీసులకు ఆమెను తాకే, తోసేసే హక్కు ఎవరిచ్చారని  ఆయన  ప్రశ్నించారు.షర్మిలకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే సామాన్య  పరిస్థితి ఏంటని ఆయన అడిగారు.  తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం పోలీస్ డిపార్ట్ మెంట్ మాత్రమే కొలువులొచ్చాయన్నారు. 

 గ్రామాలవారీగా ప్రజాప్రతినిధులతో రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.   యువత  రాజకీయంగా ఎదగాలని గద్దర్ కోరారు.  షర్మిల రాజకీయ శక్తిగా ఎదిగింది కాబట్టే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. 

 తెలంగాణ  కోసం ఎందుకు కొట్లాడినమని  ఆయన ప్రశ్నించారు.    తెలంగాణ వచ్చిన తర్వాత కన్నీళ్లు తప్ప ఏం వచ్చాయని ఆయన అడిగారు.  తెలంగాణ ఉద్యమం పాలకులు, విద్యార్థులకు జరిగిందని గద్దర్ చెప్పారు.  ఇప్పుడు జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఓట్ల యుద్ధంగా మార్చాలని గద్దర్ సూచించారు.  మన రక్తం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకున్ని దించేస్తామని దీక్ష తీసుకోాలని  గద్దర్  కోరారు. ఓటుతోనే  పాలకులను గద్దె దింపాలనిఆయన కోరారు. 

షర్మిల తెలంగాణ నాడి పట్టుకుందని ఆయన చెప్పారు.  మొదటి నుంచి సరైన నిర్ణయాలు తీసుకుందని  చెప్పారు.  గ్రామాల్లో షర్మిల ఉద్యమం ప్రారంభించాలని ఆయన  కోరారు.  .  షర్మిల పోరాటానికి తాను   పాట పాడతానని గద్దర్ చెప్పారు. కిలో మీటర్ వరకూ నడిచైనా పోరాటంలో భాగమవుతానని గద్దర్  హామీ  ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ వచ్చింది కానీ ప్రత్యేక గ్రామ తెలంగాణ రాలేదని గద్దర్ అభిప్రాయపడ్డారు.  ప్రత్యేక గ్రామ తెలంగాణ తీసుకొచ్చే బాధ్యత షర్మిల మీద ఉందని  గద్దర్  చెప్పారు. 

click me!