గద్దర్‌కు గుండెపోటు: హైద్రాబాద్ అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స

By narsimha lode  |  First Published Jul 31, 2023, 9:52 PM IST

ప్రజా యుద్దనౌక గద్దర్ కు గుండెపోటు వచ్చింది. దీంతో  ఆయనను హైద్రాబాద్ అపోలో స్పెక్ట్రా  ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.   


హైదరాబాద్: గుండె పోటుకు చికిత్స కోసం  హైద్రాబాద్ అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో గద్దర్ చేరారు.  గత పది రోజులుగా  గద్దర్  ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పది రోజుల క్రితం  ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్చారు.

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన పీపుల్స్ మార్చ్ యాత్రలో గద్దర్  పాల్గొన్నారు. మా భూములు మాకే కావాలనే నినాదంతో ఈ యాత్రలో పాల్గొన్నట్టుగా గద్దర్ ప్రకటించిన విషయం తెలిసిందే.  పీపుల్స్ మార్చ్ లో పాల్గొన్న సమయంలో  గుండె సంబంధమైన  ఇబ్బంది వచ్చిందని గద్దర్ పేర్కొన్నారు. దీంతో  హైద్రాబాద్  అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేరారు గద్దర్. గత 10 రోజులుగా గద్దర్ ఈ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. ఈ నెల  20వ తేదీ నుండి  పలు పరీక్షలు నిర్వహించారని  గద్దర్ ప్రకటించారు. 

Latest Videos

undefined

గుండె చికిత్స నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ డి. శేషగిరిరావు, డాక్టర్ వికాస్, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎన్. నర్సప్ప (అనస్తీషియా),  డాక్టర్ ప్రఫుల్  చంద్ర నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతుందని గద్దర్  మీడియాకు  విడుదల చేసిన ప్రకటనలో  వివరించారు. 

గతంలో తనకు డాక్టర్ జి. సూర్య ప్రకాశ్, బి. సోమరాజు  వైద్యం చేశారని గద్దర్ గుర్తు  చేసుకున్నారు.పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం  చేశారు.  సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నానని ప్రకటించారు.తన యోగ క్షేమాలు విచారించడానికి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్  8978480860 (ఫ్రంట్ ఆఫీస్) కు ఫోన్  చేయవచ్చని  ఆయన  కోరారు. 

కోలుకుంటున్న  గద్దర్: ఆసుపత్రి వర్గాలు

ప్రజా గాయకుడు గద్దర్ గుండె పోటుతో పది రోజుల క్రితం హాస్పటల్ లో చేరాడని అపోలో స్పెక్ట్రా  ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. డాక్టర్ దాసరి ప్రసాద్ రావు,ఇతర ప్రత్యేక వైద్యులతో నిరంతర వైద్యం జరుతుందని  ఆసుపత్రి ప్రకటించింది.  గద్దర్ ఆరోగ్యం సంతృప్తికరంగా ఉందని ఆసుపత్రి తెలిపింది.  గద్దర్ కోలుకుంటున్నారని ఆపోలో స్పెక్ట్రా కు చెందిన  ఐఎస్ రావు ప్రకటించారు .
 

click me!