ఫెడరల్ ఫ్రంట్‌కు మద్ధతిస్తా: పాలనాదక్షుడంటూ కేసీఆర్‌పై గద్దర్ ప్రశంసలు

Siva Kodati |  
Published : Nov 19, 2020, 08:24 PM ISTUpdated : Nov 19, 2020, 08:26 PM IST
ఫెడరల్ ఫ్రంట్‌కు మద్ధతిస్తా: పాలనాదక్షుడంటూ కేసీఆర్‌పై గద్దర్ ప్రశంసలు

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజా గాయకుడు గద్దర్ ప్రశంసల వర్షం కురిపించారు. 14 రోజుల కఠోర దీక్ష మామూలు విషయం కాదని గద్దర్ అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ చావుకు సైతం తెగించారని కొనియాడారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజా గాయకుడు గద్దర్ ప్రశంసల వర్షం కురిపించారు. 14 రోజుల కఠోర దీక్ష మామూలు విషయం కాదని గద్దర్ అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ చావుకు సైతం తెగించారని కొనియాడారు.

దేశ రాజకీయాల గతిని సమూలంగా  మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే, దానికి అనుబంధంగా కల్చరల్ ఫ్రంట్ పెట్టడం ద్వారా సంపూర్ణ మద్దతునిస్తానని గద్ధర్ స్పష్టం చేశారు.

జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ వెంకటాపురం డివిజన్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం గద్దర్ ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రితో గద్దర్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని దాదాపు సగభాగం సస్యశ్యామలంగా మారిందని, రైతులు,ప్రజలు సంతోషిస్తున్నారని కొనియాడారు. మరోవైపు టీఆర్ఎస్ కార్పోరేటర్‌గా వెంకటాపురం డివిజన్ నుంచి తిరిగి పోటీ చేస్తున్న సబితా కిశోర్‌ను గద్దర్ ఆశీర్వదించారు.

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. ఏయే జిల్లాలంటే?
Tallest Building in Hyderabad : హైదరాబాద్ లో అతిపెద్ద హైరైజ్ టవర్ ఏది? అత్యంత ఎత్తైన టాప్ 10 భవనాలివే