జీహెచ్ఎంసీ ఎన్నికలు: వామపక్షాల రెండో జాబితా

Siva Kodati |  
Published : Nov 19, 2020, 08:03 PM ISTUpdated : Nov 19, 2020, 08:08 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: వామపక్షాల రెండో జాబితా

సారాంశం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎంలు ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు పార్టీలు 11 మందితో తొలి జాబితాను ప్రకటించగా..  తాజాగా గురువారం 15 మందితో రెండో జాబితాను విడుదల చేశాయి. 

బీజేపీ, ఎంఐఎంల మత రాజకీయాలను ఎదుర్కొనేందుకు సీపీఐ, సీపీఎం కలిసి బరిలోకి దిగుతున్నాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. మతోన్మాద శక్తులను ఓడించి ప్రజాసమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

సీపీఐ అభ్యర్థులు 

జూబ్లీహిల్స్‌ - డి.కృష్ణకుమారి
ఐఎస్‌ సదన్‌ - జి.సుగుణమ్మ
ఎర్రగడ్డ - యాశ్మిన్‌బేగం
అమీర్‌పేట - మహబూబ్‌ ఉన్నీసా బేగం
కొండాపూర్‌ - కె.శ్రీశైలం గౌడ్‌
ముసారాంబాగ్‌ - మస్రత్‌ జహాన్‌
జగద్గిరిగుట్ట - ఇ.ఉమామహేశ్‌
రంగారెడ్డినగర్‌ - ఎండీ యాకుబ్‌  

సీపీఎం అభ్యర్థులు 

రెహమత్‌నగర్‌ - జె.స్వామి
మౌలాలి - చల్లా లీలావతి
చిలుకానగర్‌ - కె.భాగ్యలక్ష్మి
జియాగూడ - ఎ.రాజేశ్‌
సూరారం - ఆర్‌.లక్ష్మీదేవి
సంతోష్‌నగర్ -- ఎం.డి.సత్తార్‌
మన్సూరాబాద్‌ - టి.సత్తిరెడ్డి  
 
PREV
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!