మాజీ సీఎం అంజయ్య సతీమణి మణెమ్మ కన్నుమూత

By sivanagaprasad KodatiFirst Published 9, Sep 2018, 12:22 PM IST
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  టీ. అంజయ్య సతీమణి మణెమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  టీ. అంజయ్య సతీమణి మణెమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈమె భర్త అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు.

సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి మణెమ్మ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి డాక్టర్ లక్ష్మణ్‌పై మరోసారి విజయం సాధించారు. మణెమ్మ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
 

Last Updated 9, Sep 2018, 1:40 PM IST