ఎల్‌బీ స్టేడియం నుండి అల్వాల్ కు చేరుకున్న గద్దర్ పార్థీవ దేహం: కాసేపట్లో అంత్యక్రియలు

By narsimha lode  |  First Published Aug 7, 2023, 5:02 PM IST

ప్రజా యుద్దనౌక గద్దర్ అంతిమయాత్ర  ఇవాళ సాయంత్రం  అల్వాల్ లోని ఆయన  నివాసానికి చేరుకుంది.


హైదరాబాద్: ప్రజా యుద్దనౌక గద్దర్  అంతిమయాత్ర  సోమవారంనాడు సాయంత్రం అల్వాల్ కు  చేరుకుంది.  ఇవాళ మధ్యాహ్నం  ఎల్ బీ స్టేడియం నుండి  గద్దర్  అంతిమయాత్ర ప్రారంభమైంది.  గద్దర్  అంతిమ యాత్రలో వేలాదిగా  ఆయన అభిమానులు పాల్గొన్నారు.  గద్దర్ భౌతిక కాయాన్ని  అల్వాల్ లోని ఆయన  నివాసంలో కొద్దిసేపు ఉంచుతారు. తెలంగాణ సీఎం కేసీఆర్  గద్దర్ బౌతిక కాయానికి నివాళులర్పిస్తారు.  గద్దర్ నివాసానికి సమీపంలోని  గద్దర్ ఏర్పాటు చేసిన మహాబోధి  స్కూల్ లో  అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Latest Videos

అనారోగ్యంగా ఉన్న గద్దర్  నిన్న అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మృతి చెందారు.  గత నెల  20వ తేదీన గుండెపోటుకు గురికావడంతో  గద్దర్ ను  అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ   గద్దర్ నిన్న మృతి చెందారు. గుండెకు శస్త్ర చికిత్స  విజయవంతమైన తర్వాత  ఊపిరితిత్తులు, యూరినరీ  సంబంధమైన  ఇబ్బందుల కారణంగా గద్దర్ మృతి చెందినట్టుగా  ఆపోలో స్పెక్ట్రా ఆసుపత్రి వర్గాలు  ప్రకటించాయి.

also read:గద్దర్ మృతి కలచివేసింది: మావోయిస్టు పార్టీ

గద్దర్ ను చివరి చూపు చూసేందుకు గాను  పెద్ద ఎత్తున  జనం వస్తున్నారు.  దీంతో  జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు అడుగడుగునా బారికేడ్లు ఏర్పాట్లు  చేశారు. దీంతో  పోలీసులతో జనం  వాగ్వాదానికి దిగుతున్నారు.గద్దర్ మృతిపై  మావోయిస్టు పార్టీ  సంతాపం తెలిపింది.  గద్దర్ మృతి  కలచివేసిందని  మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు.

click me!