కేటీఆర్, హరీష్ మధ్య ఆసక్తికర సంభాషణ: బావా.. ఇక అవి కన్పించవు

By narsimha lodeFirst Published Jun 27, 2019, 1:40 PM IST
Highlights

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల మధ్య గురువారం నాడు సరదా సంభాషణ జరిగింది. చాలా కాలం తర్వాత  వీరిద్దరూ కలిశారు.
 

హైదరాబాద్: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల మధ్య గురువారం నాడు సరదా సంభాషణ జరిగింది. చాలా కాలం తర్వాత  వీరిద్దరూ కలిశారు.

హైద్రాబాద్‌లో కొత్త సచివాలయ పనులకు కేసీఆర్ గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు హరీష్, కేటీఆర్‌లు కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సచివాలయం శంకుస్థాపన జరిగిన తర్వాత బావ, బావమరుదల మధ్య ఆసక్తికరంగా సంభాషణ చోటు చేసుకొంది. మన చాంబర్లు చూసుకొందామన్నా కూడ కన్పించవు బావ.... అంటూ సరదాగా కేటీఆర్  హరీ‌ష్‌రావుతో వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యలకు హరీష్ రావు నవ్వుతూ అవును అంటూ సమాధానం ఇచ్చారు.

వీరిద్దరూ మంత్రులుగా ఉన్న కాలంలో డి బ్లాక్‌లోని తమ చాంబర్ నుండి విధులు నిర్వహించారు. డి బ్లాక్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో  ఆనాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు చాంబర్ ఉండేది.

ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు ఇదే బ్లాక్‌లోని రెండో ఫ్లోర్‌లో  చాంబర్  ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో దఫా అధికారంలోకి వచ్చింది. కానీ, ఈ దఫా వీరిద్దరికి కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదు.

click me!