GruhaJyothi: రెంట్‌కు ఉండే వారికి కూడా కరెంట్ ఫ్రీ

By Mahesh K  |  First Published Feb 6, 2024, 3:14 PM IST

అద్దెకు ఉంటున్న వారికి కూడా గృహజ్యోతి పథకం వర్తిస్తుందని టీఎస్ఎస్‌పీడీసీఎల్ స్పష్టం చేసింది. ఓనర్లకే కాదు.. వారి ఇంటిలో కిరాయికి ఉంటున్నవారికి కూడా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందుతుందని పేర్కొంది.
 


Free Power: కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన గృహజ్యోతి పథకాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. గృహజ్యోతి గ్యారంటీలో భాగంగా ఇప్పటికే ఉచిత ఆర్టీసీ ప్రయాణ సదుపాయాన్ని మహిళలకు అందించింది. ఇదే గ్యారంటీలో భాగమైన 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్ ఇచ్చే హామీని కూడా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఫిబ్రవరి నెల నుంచే అమల్లోకి వస్తుందని, 200 యూనిట్ల లోపు విద్యుత్‌కు జీరో బిల్లు వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

అయితే, ఒక్కో కుటుంబానికి ఒక్క మీటర్‌కే ఈ పథకం వర్తిస్తుందని తెలిసిందే. అయితే.. కిరాయికి ఉంటున్న కుటుంబాల పరిస్థితి ఏమిటీ అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఓనర్ కుటుంబానికే ఫ్రీ కరెంట్ హామీ వర్తిస్తుందని, వారి ఇంటిలో అద్దెకు ఉండే వారికి ఈ అవకాశం ఉండబోదనే ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై టీఎస్ఎస్‌పీడీసీఎల్ క్లారిటీ ఇచ్చింది.

Tenants are also eligible under proposed Gruha Jyothi Scheme

Below post by is FAKE https://t.co/Ive0FG09dG

— TSSPDCL (@TsspdclCorporat)

Latest Videos

ఈ ప్రచారం అవాస్తవం అని టీఎస్ఎస్‌పీడీసీఎల్ కొట్టిపారేసింది. గృహజ్యోతి పథకం అద్దెకు ఉండేవారికి కూడా వర్తిస్తుందని వివరించింది. ఎక్స్ వేదికగా ఓ హ్యాండిల్ చేసిన పోస్టు అవాస్తవం అని పేర్కొంది. కాబట్టి, అద్దెకు ఉండేవారికి కూడా ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని స్పష్టమైంది.

Also Read: Gyanvapi: ఏ మసీదును హిందువులకు అప్పగించం: జ్ఞానవాపి వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ

కాగా, ఫ్రీ కరెంట్ కోసం ఆధార్, రేషన్ కార్డు నెంబర్లను అనుసంధానం చేసుకోవాలని విద్యుత్ అధికారులు సూచనలు చేస్తున్నారు. అలాగే.. విద్యుత్ సర్వీస్ నెంబర్ కూడా ఆధార్‌తో లింక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

click me!