
తెలంగాణలో ఫాక్స్‌కాన్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. గురువారం ఫాక్స్‌కాన్ కంపెనీ ఛైర్మన్ యంగ్‌లియూ .. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్‌తో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో కొంగరకలాన్‌లో 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.