నిప్పులో ఎర్రగా కాల్చిన గడ్డపారను తీయించారు.. సమీప బంధువుతో వివాహేతర సంబంధంపై శీలపరీక్ష.. ములుగులో ఘటన (Video)

Published : Mar 02, 2023, 04:01 PM IST
నిప్పులో ఎర్రగా కాల్చిన గడ్డపారను తీయించారు.. సమీప బంధువుతో వివాహేతర సంబంధంపై శీలపరీక్ష.. ములుగులో ఘటన (Video)

సారాంశం

ములుగు జిల్లాలో సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ వ్యక్తికి పెద్ద మనుషులు శీల పరీక్ష పెట్టారు. నిప్పుల్లో ఎర్రగా కాల్చిన గడ్డపారను పచ్చి చేతులతో తీయించారు. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  

హైదరాబాద్: ములుగు జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 21వ శతాబ్దంలో మనిషి అద్భుత మేధోసంపన్నంతో అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. మరో వైపు కొన్ని చోట్ల అనాగరిక మూఢాచారాలను ఇంక అంటిపెట్టుకుని అజ్ఞాన కాలానికి కూరుకుపోతున్నాడు. సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అక్కడి కుల ‘పెద్ద మనుషులు’ఆ వివాహితుడికి అగ్ని పరీక్ష పెట్టారు. నిప్పుల్లో ఎర్రగా కాల్చిన గడ్డపారను తీయించారు. గడ్డపార తీసిన తర్వాత అతని చేతులు కాలిపోతే వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు.. కాలకపోతే నిర్దోషి అని ఈ అగ్ని పరీక్ష వెనుక ఉన్న సూత్రం. ఈ అనాగరిక, మూఢ పరీక్షను అతనిపై ప్రయోగించారు. ఇప్పటి ఆధునిక కాలంలోనూ ఇంతటి తిరోగమన పరీక్ష పెట్టడం శోచనీయమని నెటిజన్లు పేర్కొంటున్నారు. వివాహేతర ఆరోపణలు చేసింది ఆయన భార్య కూడా కాదు.

వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా, ములుగు మండలం బంజరుపల్లిలో గత నెల చివరి వారంలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజరుపల్లికి చెందిన గంగాధర్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని జగన్నాథం అనే వ్యక్తి కుల పెద్దలకు ఫిర్యాదు చేశాడు. పంచాయితీ పెట్టాలని కోరాడు. దీంతో పెద్దలు పంచాయితీ పెట్టి గంగాధర్‌ను పిలిపించారు. వివాహేతర సంబంధ ఆరోపణలపై ఆరా తీశారు. తనకు సంబంధమే లేదని మొర్రో అని గంగాధర మొత్తుకున్నా పట్టించుకోలేదు. పంచాయితీ కోసం ఇరు వర్గాల నుంచి రూ. 11 లక్షల చొప్పున ముందస్తు డిపాజిట్‌గా తీసుకున్నారు. తనపై లేని పోని ఆరోపణలు చేయడమే కాక రూ. 11  లక్షలు లాగేశారని గంగాధర్ వాపోయాడు.

Also Read: దేవుడా! మాకు ప్రధాని మోడీని ఇవ్వు.. అక్కడ ముస్లింలకే రూ. 150కే కిలో చికెన్: పాక్ యువకుడి వినతి.. వైరల్ వీడియో

పంచాయితీలో భాగంగా గంగాధర్‌కు అగ్ని పరీక్షతో శీల పరీక్ష పెట్టాడు. కట్టెలకు నిప్పు పెట్టి గడ్డపారను అందులో కాల్చారు. కట్టెలు కాలిపోయి నిప్పు కణికల మధ్య ఎర్రగా కాల్చిన గడ్డపారను బయటకు తీసి అమాయకత్వాన్ని నిరరూపించుకోవాలని పెద్ద మనుషులు ఆదేశించారు. గంగాధర్ నీళ్లు పైన పోసుకుని తడి బట్టలతోనే ఆ మంట వద్దకు వచ్చి దాని చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. ఆ తర్వాత గడ్డపారను రెండు చేతులతో తొలగించాడు. తీసి చేతులను మళ్లీ ముడుచుకున్నాడు. 

పెద్ద మనుషులు అనుకున్నంతగా చేతులు కాలలేదు. ఆ పరీక్షలో గంగాధర్ నెగ్గాడు. అయినా.. అతనిపై వచ్చిన ఆరోపణలను వారు తోసిపుచ్చలేదు. తప్పు ఒప్పుకోవాలని గంగాధర్ పై ఒత్తిడి తెచ్చారు. దీంతో గంగాధర్ భార్య పోలీసులను ఆశ్రయించారు. అదే రోజు పోలీసులను ఆశ్రయించి జరిగిన ఉదంతంపై ఫిర్యాదు చేశారు. తాము డిపాజిట్ చేసిన మొత్తంలో పెద్ద మనుషులు అప్పటికే రూ. 6 లక్షలు ఖర్చు పెట్టేశారని పేర్కొన్నారు. ఈ కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం