తల్లి పక్కలో ఉండగానే తల కొరికేసిన అడవిమృగాలు.. కళ్లు బైటికొచ్చి చిన్నారి మృతి..

By AN TeluguFirst Published Feb 19, 2021, 2:42 PM IST
Highlights

అడవి జంతువులు ఓ చిన్నారిని కర్కశంగా చంపేశాయి. తలకొరికి చిదిమేశాయి. దీంతో కళ్లు బైటికి వచ్చి, నాలుగేళ్ల చిన్నా  అతి దారుణంగా మృత్యువాత పడ్డాడు. ఈ హృదయవిదారక ఘటన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. 

అడవి జంతువులు ఓ చిన్నారిని కర్కశంగా చంపేశాయి. తలకొరికి చిదిమేశాయి. దీంతో కళ్లు బైటికి వచ్చి, నాలుగేళ్ల చిన్నా  అతి దారుణంగా మృత్యువాత పడ్డాడు. ఈ హృదయవిదారక ఘటన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. 

జిల్లాలోని  తుర్కపల్లి మండలం వాసాల మర్రి గ్రామశివారులో చిత్తూరు జిల్లా వాపన్‌ పల్లి కాలనీకి చెందిన శివ, అతని కొడుకు హరీశ్ కుటుంబంతో సహా వలసవచ్చారు. వీరు వచ్చి నెల రోజులవుతుంది. వీరు చుట్టుపక్కల ఊర్లలో కోళ్లు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. 

హరీశ్‌కు భార్య గంగోత్రి, కొడుకు మునేశ్వర్ రావు (4)లు ఉన్నారు. రోజూలాగే బుధవారం సాయంత్రం కూడా కోళ్లు అమ్ముకుని వచ్చారు. రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. 

గ్రామశివార్లు అటవీప్రాంతం కావడంతో వీళ్లు చాలా జాగ్రత్తగా ఉన్నారు. పాములు, తేళ్ల భయమూ ఎక్కువే. అందుకే నాలుగేళ్ల మునేశ్వర్ రావు పక్కన తల్లి గంగోత్రి, ఆమె పక్కన హరీష్, మునేశ్వర్ రావు మరో పక్కన తాత శివ పడుకున్నారు. ఓ రాత్రి పూట పిల్లాడు ఏడవడంతో తల్లి గంగోత్రి నిద్రలేచి, పాలివ్వడంతో మళ్లీ నిద్రపోయారు. 

ఉదయం 5 గంటలకు లేచేసరికి దారుణం జరిగిపోయింది. తల్లి, తాతల మధ్యలో పడుకున్న మునేశ్వర్ రావు తల కొరికేసినట్టు కనిపించింది. దీంతో గంగోత్రి గట్టిగా కేకలు వేయడంతో తాత శివ, తండ్రి హరీష్ లు మేల్కున్నారు. చూడగా బాబు తల సగం కొరికేసి ఉంది. రక్తం మడుగులో బాబు ఉన్నాడు. 

తీవ్రగాయాల పాలై బాబు కళ్లు బయటికి వచ్చాయి. విగతజీవిగా మారిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. రాత్రి 2.30 గంటల సమయంలో బాలుడి తలను అడవి జంతువులు కొరికేసి ఉంటాయని అనుమానిస్తున్నారు. అయితే, చిన్నారి తలను కొరికేసింది కుక్కలా, అడవిజంతువులా అనేది తేలాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అసలు విషయం బైటపడుతుందని పోలీసులు తెలిపారు. 

click me!