హైద్రాబాద్ వాసులకు షాక్: హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

By narsimha lodeFirst Published Feb 19, 2021, 11:43 AM IST
Highlights

హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే ద్విచక్రవాహనదారులకు సైబరాబాద్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. 2019 ఎంవీ యాక్ట్ ను కచ్చితంగా అమలు చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు.
 

హైదరాబాద్: హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే ద్విచక్రవాహనదారులకు సైబరాబాద్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. 2019 ఎంవీ యాక్ట్ ను కచ్చితంగా అమలు చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు.

హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ఇక చుక్కలు కన్పించనున్నాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ తొలిసారిగా పోలీసులకు చిక్కితే మూడు మాసాల పాటు లైసెన్స్ ను రద్దు చేస్తారు.

ఇక రెండోసారి కూడ అదే తప్పు చేస్తే  శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తారు. బైక్ పై వెనుక కూర్చొన్నవారు కూడ హెల్మెట్ పెట్టుకోవాలని సైబరాబాద్ పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు.

ఇప్పటికే హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇక నుండి 2019 ఎంవీ యాక్ట్ ను కచ్చితంగా అమలు చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు. 

నకిలీ హెల్మెట్ విక్రయాలపై కూడ సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకొన్నారు. నకిలీ హెల్మెట్లు తయారు చేసే వారిని గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. నకిలీ హెల్మెట్లను విక్రయిస్తున్నవారిపై కూడ చర్యలు తీసుకొన్నారు. 

హెల్మెట్ల కొనుగోలు విషయంలో కూడ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ద్విచక్రవాహన ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్లు లేని కారణంగా మరణాలు సంభవించినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో హెల్మెట్ల విషయమై సైబరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.
 

click me!