
పెద్దపల్లి: లాయర్ దంపతుల హత్య కేసులో పోలీసులు బిట్టు శ్రీనును అరెస్టు చేశారు. బిట్టు శ్రీను టీఆర్ఎస్ నేత, మాజీ శాసనసభ్యుడు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు మేనల్లుడు. నిందితులకు వాహనాన్ని, ఆయుధాలను బిట్టు శ్రీను సరఫరా చేసినట్లు గుర్తించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
హైకోర్టు న్యాయవాది వామన్ రావును, ఆయన భార్య నాగమణిని నడిరోడ్డు మీద పెద్దపల్లి సమీపంలో నరికి చంపిన విషయం తెలిసిందే. వామన్ రావు దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనుకు కారును, హత్యకు ఉపోయగించిన రెండు కత్తులను బిట్టు శ్రీను ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
పుట్ట మధు తన తల్లి పేరిట నిర్వహిస్తున్న ట్రస్టు బాధ్యతలను బిట్టు శ్రీను చూస్తుంటాడు. కత్తులను బిట్టు శ్రీను మంథనిలోని ఓ పండ్ల దుకాణం నుంచి తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ దుకాణం ఓ ప్రజాప్రతినిధికి చెందింది. పరారీలో ఉ్న బిట్టు శ్రీనును ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మంథనిలో బిట్టు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వామన్ రావు జంట హత్య కేసులో ప్రధాన నిందుతులను పోలీసులు గురువారంనాడు అరెస్టు చేశారు. కుంట శ్రీనివాస్ తో పాటు అక్కపాక కుమార్, శివందుల చిరంజీవిలను పోలీసులు అరేసెట్ చుేశారు. తులిసెగారి శ్రీను అలియాస్ బిట్టు శ్రీను వారికి కారును, కొబ్బరి బొండాలు నరికే రెండు కత్తులను వారికి సమకూర్చాడు.