కోదాడలో విషాదం...చెరువులో మునిగి నలుగురు యువకులు మృతి (వీడియో)

Published : Feb 27, 2019, 05:11 PM ISTUpdated : Feb 27, 2019, 08:36 PM IST
కోదాడలో విషాదం...చెరువులో మునిగి నలుగురు యువకులు మృతి (వీడియో)

సారాంశం

సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి నలుగురు ఇంజీనీరింగ్ విద్యార్థులు మృతిచెందారు.  

సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి నలుగురు ఇంజీనీరింగ్ విద్యార్థులు మృతిచెందారు.

 ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అనురాగ్ ఇంజనీరిగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిది ఇవాళ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడు తన స్నేహితులకు కోదాడ పట్టణ శివారులోని పెద్ద చెరువు వద్ద సరదాగా పార్టీ ఏర్పాటుచేశాడు. అక్కడే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు.

ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రవీణ్, సమీర్, భవాని ప్రసాద్, మహేందర్ అనే విద్యార్థులు పార్టీ తర్వాత చేతులు కడుక్కోడానికి చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తు చెరువులో పడిన వీరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి  తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం కాలేజికని వెళ్లిన పిల్లలు ఇలా విగతజీవులుగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

వీడియో 

"

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం