తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు..

Published : Aug 21, 2022, 11:28 AM ISTUpdated : Aug 21, 2022, 11:33 AM IST
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు..

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్టానం నుంచి పిలుపువ వచ్చింది . ఢిల్లీకి రావాలని 8 మంది టీ కాంగ్రెస్ నేతలకు పార్టీ హై కమాండ్ సమాచారం పంపింది. 

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్టానం నుంచి పిలుపువ వచ్చింది . ఢిల్లీకి రావాలని 8 మంది టీ కాంగ్రెస్ నేతలకు పార్టీ హై కమాండ్ సమాచారం పంపింది. వారికి నేరుగా ఫోన్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్.. పార్టీ హైకమాండ్ ఆదేశాల గురించి తెలియజేశారు. మునుగోడు ఉపఎన్నికపై అనుసరించాల్సిన వ్యుహం, అభ్యర్థి ఎంపిక, పార్టీలో చోటుచేసుకుంటున్న అంతర్గత పంచాయితీలపై టీ కాంగ్రెస్ నేతలతో అధిష్టానం చర్చించే అవకాశం ఉంది. అయితే టీ కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి రావాలని పిలిచినప్పటికీ.. వారు ఎప్పుడు రావాలనేది త్వరలోనే సమాచారం అందనున్నట్టుగా తెలుస్తోంది. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో పాటు.. కొందరు సీనియర్ నేతలకు పార్టీ అధిష్టానం నుంచి ఢిల్లీకి రావాలని సందేశం అందినట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరెవరికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఈ సమావేశం సాగనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్‌తో పాటు టీ కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. 

PREV
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?