తాగేసి నడిపారు: కారు పల్టీలు కొట్టి, నలుగురు బీ.టెక్ విద్యార్ధుల మృతి

Siva Kodati |  
Published : May 01, 2019, 10:53 AM ISTUpdated : May 01, 2019, 10:57 AM IST
తాగేసి నడిపారు: కారు పల్టీలు కొట్టి, నలుగురు బీ.టెక్ విద్యార్ధుల మృతి

సారాంశం

యాదాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు

యాదాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీహిందూ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 16 మంది విద్యార్ధులు.. ఓ గెస్ట్‌హౌస్‌‌లో మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ చేసుకున్నారు.

అక్కడే పీకలదాకా మద్యం సేవించారు. అనంతరం వారిలో ఐదుగురు విద్యార్ధులు కలిసి కారులో నాగినేనిపల్లి వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో మితిమీరిన వేగం, దానికి తోడు మద్యం సేవించి ఉండటం, మలుపు ఉండటంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు అక్కడికక్కడే మరణించగా, మరో విద్యార్ధిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. తీవ్రగాయాల పాలైన మరొకరిని హైదరాబాద్‌కు తరలించారు.

మరణించిన వారిని చాదర్‌ఘాట్‌కు చెందిన ప్రణీత, కొత్తపేటకు చెందిన స్ఫూర్తి రెడ్డి, మీర్‌పేట్‌కు చెందిన చైతన్య, కుంట్లూరుకు చెందిన మనీష్ రెడ్డి, వినీత్ రెడ్డిలుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

వ్యవసాయంపై ఎల్ నినో ఎఫెక్ట్..75 ఏళ్ల హిస్టరీలోనే బిగ్గెస్ట్ డేంజర్ | AP & Telangana Rain Alert
రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ | CM Revanth Reddy Entry at Rythu Ashirvada Sabha