రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..

Published : May 16, 2023, 09:04 AM IST
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..

సారాంశం

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ రహదారిపై డీసీఎంను సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ  ఢీకొట్టింది.

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ రహదారిపై డీసీఎంను సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సోమవారం అర్దరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం  చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

అయితే సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ వేగంగా వచ్చి డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతిచెందినవారి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!