రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్య.. ఇంతకీ ఏమన్నారంటే?

Published : May 16, 2023, 05:09 AM IST
రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్య.. ఇంతకీ ఏమన్నారంటే?

సారాంశం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై  తమ పార్టీ త్వరలో సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తుందని బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయనపై సస్పెన్షన్ వేటును ఉపసంహరించుకునే ప్రక్రియపై చర్చిస్తున్నట్లు తెలిపారు.  

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు త్వరలోనే ఊరట లభించనున్నది. తమ పార్టీ త్వరలో సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తుందని బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయనపై సస్పెన్షన్ వేటును ఉపసంహరించుకునే ప్రక్రియపై చర్చిస్తున్నట్లు తెలిపారు. అంతిమంగా పార్టీనే తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.  ఈ సస్పెన్షన్ వేటును ఉపసంహరించే సమావేశంలో తాను కూడా పాల్గొంటానని,  ఈ విషయంపై అన్ని రకాలుగా ఆలోచిస్తామనీ, హైకమండ్ కు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని అన్నారు. 

 గత ఏడాది ఆగస్ట్ నెలలో రాజాసింగ్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయన పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయంపై రాజాసింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?