ఘోర రోడ్డు ప్రమాదం: అక్కడికక్కడే నలుగురు కూలీలు మృతి

Published : Jul 16, 2020, 08:06 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం: అక్కడికక్కడే నలుగురు కూలీలు మృతి

సారాంశం

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. కూలీలంతా రంగారెడ్డి జిల్లాకు చెందినవారు.

మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్ట మీది నుచి వెళ్తున్న లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. లారీ అక్రమంంగా కర్రలను రవాణా చేస్తున్నట్లు తేలింది. 

ఆ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 11 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటరమణ, సీఐ చేరాలు, ఎస్సై నగేష్, ఆర్టీవో ఈశ్వరయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

ప్రమాదం నుంచి ఏడుగురు కూలీలు ప్రాణాలతో బయటపడ్డారు. కూలీలు రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలంం అంబోతుల తండాకు చెందినవారని పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో మరణించినవారిలో అంబోతు హర్యా, అంబోతు గోవిందర్, అంబోతు మధు, రాట్ల ధూర్యా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !