గాంధీలో మరో దారుణం: ఆక్సిజన్ కొరతతో కరోనా రోగి మృతి

By Siva KodatiFirst Published Jul 15, 2020, 7:26 PM IST
Highlights

గాంధీ ఆసుపత్రిలో రోజుకొక దారుణం వెలుగు చూస్తోంది. తాజాగా బుధవారం ఆక్సిజన్ కొరతతో మరో కరోనా రోగి మృత్యువాతపడ్డాడు. 

గాంధీ ఆసుపత్రిలో రోజుకొక దారుణం వెలుగు చూస్తోంది. తాజాగా బుధవారం ఆక్సిజన్ కొరతతో మరో కరోనా రోగి మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీధర్ అనే వ్యక్తి నాలుగు రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నాడు.

అయితే అతను చికిత్స కోసం రెండు రోజుల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. కోవిడ్ టెస్టులు చేయడంతో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించారు.

Also Read:కరోనా దెబ్బ: గాంధీభవన్ వారం పాటు మూసివేత

అయితే గాంధీలో ఆక్సిజన్ కొరత వల్ల అతనికి ఆక్సిజన్ పెట్టలేదు. దీంతో శ్రీధర్ ఇవాళ మరణించాడు. ఉస్మానియాలో ఉన్నన్ని రోజులు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందించారని, గాంధీలో మాత్రం ఆక్సిజన్ పెట్టకుండా నిర్లక్ష్యం చేయడంతో మృతి చెందాడని శ్రీధర్ బంధువులు ఆరోపిస్తున్నారు. 

గాంధీ ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నర్సులతో ప్రభుత్వం జరిపిన చర్చలు బుధవారం నాడు సాయంత్రం ఫలవంతమయ్యాయి. సమ్మె విరమించేందుకు నర్సులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అంగీకరించారు.

Also Read:ఉస్మానియాలో దారుణం.. మృతదేహాల మధ్యే కరోనా రోగుల ఐసోలేషన్

ఆరు రోజులుగా గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ నర్సులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. బుధవారం నాడు వీరితో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలు విజయవంతమైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఔట్ సోర్సింగ్ ద్వారా నర్సులుగా విధుల్లో ఉన్న వారి వేతనాలను రూ. 17,500 నుండి రూ. 25 వేలకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కరోనా విధుల్లో ఉన్న వాళ్లకు ప్రతి రోజూ డైలీ ఇన్సెంటివ్ కింద రూ. 750 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు విధానంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తామని డీఎంఈ హామీ ఇచ్చారు.
 

click me!