మైనంపల్లి ఇంట్లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ.. అందుకోసమేనా..?

By Sumanth KanukulaFirst Published Dec 19, 2022, 12:44 PM IST
Highlights

మేడ్చల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఒకేచోట భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మేడ్చల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఒకేచోట భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. ఈ భేటీకి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశం రెండు గంటలకు పైగా కొనసాగుతుంది. అయితే బ్రేక్ ఫాస్ట్ కోసమే మిగిలిన ఎమ్మెల్యేలను ఇంటికి ఆహ్వానించినట్టుగా మైనంపల్లి హన్మంతరావు చెబుతున్నారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని అంటున్నారు. 

అయితే మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నుంచి మంత్రిగా ఉన్న మల్లారెడ్డిపై అసమ్మతితోనే ఎమ్మెల్యేలు ఈ సమావేశం నిర్వహించినట్టుగా బీఆర్ఎస్ వర్గాల్లోనే ప్రచారం సాగుతుంది. గతంలో మంత్రి మల్లారెడ్డి అందరితో కలుపుగోలు ఉన్నప్పటికీ.. ఇటీవలి కాలంలో  ఆయన చర్యలపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో కూడా మంత్రి మల్లారెడ్డి జోక్యం ఎక్కువగా ఉందని భావిస్తున్న ఎమ్మెల్యేలు.. ఈ విషయంపై చర్చించేందుకు మైనంపల్లి హన్మంతరావు నివాసంలో సమావేశమైనట్టుగా తెలుస్తోంది. జిల్లాలో జరుగుతన్న పరిణామాలను పార్టీ అధినేత కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని వారంతా భావిస్తున్నారు.  
 

click me!