అయ్యప్పమాలలో ఉండి రోహిత్ రెడ్డి అబద్దాలు చెప్పారు.. అలా అని ఎందుకు ప్రమాణం చేయలేదు: రఘునందన్‌రావు

Published : Dec 19, 2022, 12:21 PM IST
అయ్యప్పమాలలో ఉండి రోహిత్ రెడ్డి అబద్దాలు చెప్పారు.. అలా అని ఎందుకు ప్రమాణం చేయలేదు: రఘునందన్‌రావు

సారాంశం

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అయ్యప్పమాలలో ఉండి పచ్చి అబ్బద్దాలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద రోహిత్ రెడ్డి నిజాలు మాట్లాడతారని అనుకన్నామని.. కానీ అలా జరగలేదని అన్నారు. 

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అయ్యప్పమాలలో ఉండి పచ్చి అబ్బద్దాలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద రోహిత్ రెడ్డి నిజాలు మాట్లాడతారని అనుకన్నామని.. కానీ అలా జరగలేదని అన్నారు. రోహిత్ రెడ్డి నిజంగానే డ్రగ్స్ తీసుకోకుంటే.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. సోమవారం రఘనందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. పైలెట్ రోహిత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. తనపై టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని సవాలు విసిరారు. 

రోహిత్ డ్రగ్స్ తీసుకుంటారా? లేదా?, విద్యార్హత విషయంలో ఆయన తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని తాను అడిగితే.. ఆ విషయాలు పక్కన పెట్టి సంబంధం లేని వాటి గురించి మాట్లాడారని అన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో రోహిత్ రెడ్డి  తప్పుడు వివరాలు ఇచ్చారని ఆరోపించారు. 2009 కంటే ముందు స్వీడన్ వర్సిటీలో చదివినట్టుగా వివరాలు ఇచ్చారని తెలిపారు. అది 2018 నాటికి ఇంటర్‌గా ఎలా మారిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్హతల విషయంలో ఆయన తప్పుడు వివరాలు ఇచ్చారని విమర్శించారు. తెలంగాణతో, తెలంగాణ ఉద్యమంతో రోహిత్ రెడ్డికి సంబంధం లేదని అన్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్‌, పట్నం మహేందర్ రెడ్డి‌లపై రోహిత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ప్రదర్శించారు.

తనను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం గురించి అప్పుడే అందరిని అడిగానని చెప్పారు. తాను అక్రమంగా సంపాదిస్తే ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. తాను తప్పు చేయలేదు కనుకే ఎలాంటి విచారణ చేయడం లేదని అన్నారు. సర్పన్ పల్లి భూములకు, రోహిత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేనట్టయితే చీఫ్ సెక్రటరీకి లేఖ రాయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.  రోహిత్ రెడ్డి అయ్యప్ప మాలలో ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో ఇంతకంటే ఏం మాట్లాడలేకపోతున్నానని అన్నారు. రోహిత్ రెడ్డి మాల తీసిన తర్వాత తాను అన్నింటికి జవాబు చెప్తానని రఘునందన్ స్పష్టం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?