టీఆర్ఎస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు పలువురు రంగంలోకి దిగినట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో హైదరాబాద్ శివార్లలోని ఫాం హౌస్‌లో దాడులు చేసి నలుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు
మునుగోడు ఉపఎన్నిక వేళ.. తెలంగాణలో ఫిరాయింపుల కోసం భారీ కుట్ర జరిగిందా..?? భారీగా నోట్ల కట్టలతో పట్టుబడ్డ వారు ఎవరు..? తెలంగాణ పోలీసుల ఆపరేషన్‌లో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. డబ్బు కట్టలతో తిరుపతికి చెందిన రామచంద్రభారతి, సింహయాజులు, తిరుపతి, నందకుమార్‌లు హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. పూర్తి సాక్ష్యాధారాలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. వీరి టార్గెట్ లిస్ట్‌లో నలుగురు ఎమ్మెల్యేలు వున్నట్లుగా ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది.
టీఆర్ఎస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు పలువురు రంగంలోకి దిగినట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. పైన పేర్కొన్న నలుగురు వ్యక్తులు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్లుగా ఎన్టీవీ తన కథనంలో తెలిపింది. హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలతో బేరాలు జరుగుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
దీనిపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని సమాచారం వచ్చిందన్నారు. రామచంద్రభారతి సంప్రదింపులు చేసినట్లు సమాచారం అందిందని సీపీ చెప్పారు. నందకుమార్, సింహయాజులులు రామచంద్రభారతిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు. పార్టీ ఫిరాయిస్తే పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లుగా తెలుస్తోందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సమాచారం ఇచ్చారని.. ఫామ్ హౌస్‌లో దాడులు చేశామని రవీంద్ర అన్నారు. రామచంద్రభారతి ఫరీదాబాద్ టెంపుల్‌లో వుంటారని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. తిరుపతి నుంచి కూడా ఒక స్వామిజీ ఇక్కడికి వచ్చారని ఆయన అన్నారు. వీళ్లంతా కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోందని సీపీ చెప్పారు. ఏమని ప్రలోభాలు పెట్టారనే దానిపై విచారణ జరుపుతున్నామని.. డబ్బులు, కాంట్రాక్ట్‌లు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లుగా తెలుస్తోందని రవీంద్ర అన్నారు.