తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. పాలన సౌలభ్యం కోసం రాష్ట్రాల విభజన జరిగిందన్నారు.
హైద్రాబాద్: బీబీసీ ఇటీవల ప్రసారం చేసిన డాక్యుమెంటరీ ప్రధాని మోడీతో పాటు దేశాన్ని అవమానపర్చిందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
హైద్రాబాద్ నార్సింగిలో తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనాన్ని ఆదివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు , హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ దర్శకులు రాఘవేంద్రరావు తదితరుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రసంగించారు.
ప్రపంచంలో మత వివక్ష లేని దేశం ఏదైనా ఉందంటే అది ఇండియా మాత్రమేనన్నారు. ఇండియా మోస్ట్ సెక్యులర్ దేశమన్నారు. ఈ విషయమై తాను ఛాలెంజ్ చేస్తామన్నారు.. దేశంలోని మైనార్టీలు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. కానీ ఇతర దేశాల్లో ఆ రకమైన పరిస్థితులు లేవన్నారు.
దేశంలో అక్కడక్కడ కొన్ని ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ తరహ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ చూసుకోవాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఇతర భాషల మోజులో పడి మాతృభాషను వదులుకోవదన్నారు. తెలుగు వాళ్లంతా ఎక్కడున్నా మనమంతా కలిసి ఉండాలని ఆయన సూచించారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాల విభజన జరిగిందన్నారు.
మాతృభాషలోనే చదువుకున్న వాళ్లలో అనేక మంది రాష్ట్రపతి, ఉపరాష్టరపతి, సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి వంటి పదవులను పొందారన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా తన మాతృభాషలోనే చదువుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒకప్పుడు ప్రపంచంలోనే ధనిక దేశం ఇండియా అని ఆయన గుర్తు చేశారు. .ఇంగ్లీష్ వాళ్లు మన దేశాన్ని దోచుకొని వెళ్లిపోయారన్నారు. మరో పదేళ్లలో దేశం ఆర్ధిక శక్తిగా మారుతుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
నూతన విద్యావిధానంలో మాతృభాషను కాపాడుకొనే వీలు కల్పించిందని చెప్పారు..తాను రాజ్యసభ చైర్మెన్ గా ఉన్న సమయంలోనే మాతృభాషలో మాట్లాడే అవకాశం కల్పించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. . ,చట్టసభల్లో, కోర్టుల్లో కూడా మాతృభాషల్లో మాట్లాడాల్సిన అవసరాన్ని వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. మన సంస్కృతి , సంప్రదాయాలను కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. తాను పదవి విరమణ చేసినట్టుగా చెప్పారు. కానీ తాను పెదవి విరమణ చేయలేదన్నారు. తనకు వచ్చిన ఆలోచనలు, అభిప్రాయాలను, అనుభవాలను ప్రజలకు అన్నీ విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వెంకయ్యనాయుడు చెప్పారు.
పాశ్యాత్య సంస్కృతి మోజులో పడకూడదని వెంకయ్యనాయుడు సూచించారు. కొంపలు ఆర్పే వేసే సంస్కృతి విదేశీయులదన్నారు. దీపం వెలిగించే సంస్కృతి మనదని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. మన ఎదుగుదలను ఇతర దేశస్తులు సహించలేరన్నారు. ఇతర దేశస్తుల ఎదుగుదలను మనం సహిస్తామన్నారు.