బీజేపీలో చేరుతారంటూ ప్రచారం.. పార్టీ మార్పుపై తేల్చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Siva Kodati |  
Published : Apr 15, 2022, 03:45 PM IST
బీజేపీలో చేరుతారంటూ ప్రచారం.. పార్టీ మార్పుపై తేల్చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సారాంశం

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్‌ను వీడుతారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.   

తాను బీజేపీలో (bjp) చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. తాను ఏ పార్టీలోనూ చేరట్లేదని.. టీఆర్ఎస్‌లోనే (trs) కొనసాగుతానని స్పష్టంచేశారు. పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అస్తమానం మారుతూ ఉంటామా అని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. 

ఖమ్మం జిల్లా (khammam district) కూసుమంచి మండలం మునిగేపల్లిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మెడలు వంచామన్న బీజేపీ నాయకుల మాటలకు జనాలు నవ్వుకుంటున్నారని సెటైర్లు వేశారు. ఎవరి తృప్తి కోసం వాళ్లు మాట్లాడుతున్నారని శ్రీనివాస్ రెడ్డిని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌వి (bandi sanjay) అహంకారపూరీతమైన మాటలంటూ ఫైరయ్యారు. బీజేపీ అంత పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదని.. వాళ్లే నష్టపోతారని శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రతి ఏటా ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పొంగులేటి తెలిపారు.

మరోవైపు ... ఈ నెల 16వ తేదీన మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విందు ఏర్పాటు చేయనున్నారు. తన ఇంటికి భోజనానికి రావాలని పొంగులేటి కోరడంతో.. మంత్రి కేటీఆర్ అంగీకరించారు. మంత్రి భోజన ఏర్పాట్లను మాజీ ఎంపీ వర్గీయులు భారీస్థాయిలో చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. 2014లో వైఎస్సార్సీపీ తరపున ఖమ్మం ఎంపీగా గెలుపొందిన పొంగులేటి.. ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరారు. 2019లో ఆయనకు టికెట్ దక్కలేదు. అప్పటి నుంచి అధిష్టానంపై అసంతృప్తితో వున్నప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. 

అంతకుముందు బుధవారం నాడు నిర్వహించిన ఓ కార్యక్రమంలో Ponguleti Srinivas Reddy సంచలన వ్యాఖ్యలు చేశారు. బతికినంత కాలం అధికారం నీతో ఉండదని.. పదవులు ఎవరికీ శాశ్వతం కాదన్నారు. పదవులున్నా లేకున్నా ప్రజల అభిమానాలు పొందినప్పుడే ప్రజా ప్రతినిధుల వ్యక్తిత్వానికి గౌరవం పెరుగుతుందని పొంగలేటి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రజా ప్రతినిధులంతా  గమనంలో పెట్టుకోవాలని ఆయన సూచించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?