టీఆర్ఎస్‌కి షాక్:ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నల్లాల ఓదేలు

By narsimha lodeFirst Published May 19, 2022, 4:03 PM IST
Highlights

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన భార్య మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూరులో స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ కు, ఓదేలుకు మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది.
 

న్యూఢిల్లీ: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, Nallala Odelu మంచిర్యాల జిల్లా పరిషత్  చైర్ పర్సన్ Bhagya Laxmi గురువారం నాడు టీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పారు. Priyanka Gandhi సమక్షంలో Congress పార్టీలో చేరారు.  ఇవాళే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఏపీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్ రావు లతో కలిసి ఓదేలు, ఆయన భార్య భాగ్యలక్ష్మిలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.ఈ భేటీ ముగిసిన తర్వాత ప్రియాంకగాంధీ సమక్షంలో ఓదేలు, ఆయన భార్య భాగ్యలక్ష్మిలు కాంగ్రెస్ లో చేరారు.

టీఆర్ఎస్ ను వీడే విషయమై ఓదేలు చాలా కాలంగా తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు.  పార్టీ వారడానికి అనుచరులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో  ఓదేలు పార్టీ  మారాలని నిర్ణయం తీసుకున్నారు. 

2014లో పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి బాల్క సుమన్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికల సమయంలో ఓదేలుకి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. ఈ స్థానంలో ఓదేలు స్థానంలో బాల్క సుమన్ కు టికెట్ ఇచ్చారు.  2019 పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి వెంకటేష్ కు టికెట్ ఇచ్చారు.

also read:టీఆర్ఎస్ షాకివ్వనున్న ఓదేలు: కాంగ్రెస్‌లోకి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల

ఆ తర్వాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నల్లాల ఓదేలు భార్య భాగ్యలక్ష్మిని మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఎంపిక చేశారు.  అయితే ఆ తర్వాత తమకు పార్టీలో సరైన గౌరవం లేకుండా పోయిందని ఓదేలు ఆరోపించారు. పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పదే పదే చెబుతున్నా కూడా పట్టించుకోలేదన్నారు. తన భార్య జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పేరుకే ఉందన్నారు.

తమ వర్గం నేతలపై బాల్క సుమన్ వేధింపులకు పాల్పడ్డారని  ఓదేలు ఆరోపించారు. ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో గౌరవం లేని కారణంగానే తాను టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా  ఓదేలు చెప్పారు.తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకొన్నా కూడా పార్టీ కానీ, ప్రభుత్వం కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోలేదని ఓదేలు ఆవేదన వ్యక్తం చేశారు. 

నల్లాల ఓదేలుకు కాంగ్రెస్ పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. దళితులకు టీఆరఎస్ ద్వాారా న్యాయం జరుగుతుందని భావించినా వారికి నిరాశే మిగిలిందని రేవంత్ రెడ్డి చెప్పారు.

 

click me!