Telangana MLC: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి.. ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్

By team teluguFirst Published Nov 19, 2021, 10:12 AM IST
Highlights

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా (governor quota mlc) శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి (sirikonda madhusudhana chary) పేరును తెలంగా ప్రభుత్వం ప్రతిపాదించింది. మంత్రుల సంతకాలతో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు.. రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదన పంపింది. ఇందుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. 

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి (sirikonda madhusudhana chary) పేరును తెలంగా ప్రభుత్వం ప్రతిపాదించింది. మంత్రుల సంతకాలతో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు.. రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదన పంపింది.ఇందుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.  ఇంతకు ముందు హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) పేరును ప్రభుత్వం.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా (governor quota mlc) ప్రతిపాదించింది. అయితే అందుకు గవర్నర్‌ ఆమోదం తెలుపకపోవడంతో.. పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేయించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కోటాలో పెండింగ్‌లో ఉన్న ఆ స్థానానికి.. మధుసూదనచారి పేరును ప్రతిపాదిస్తూ కేబినెట్ ప్రతిపాదన పంపింది. బుధవారమే ఈ ఫైల్ రాజ్‌భవన్‌కు చేరినట్టుగా తెలుస్తోంది. తాజాగా గవర్నర్ తమిళిసై ఆమోదంతో ఆయన శాసన మండలి సభ్యుడిగా మారారు. 

ఇక, మధుసూదనాచారిని రాజ్యసభ్యకు పంపుతారని ప్రచారం జరిగినప్పటికీ.. ఎమ్మెల్సీగా శాసన మండలికి పంపించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలి మాజీ చైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డిని (gutta sukender reddy) కేసీఆర్.. మరోసారి మండలికి పంపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుసూదనాచారిలలో ఎవరో ఒకరు మండలి చైర్మన్‌‌గా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2014 నుంచి 2018 వరకు శాసనసభ స్పీకర్‌గా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన మధుసూదనాచారినే మండలి చైర్మన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఇక, madhusudhana chary తెలంగాణ రాష్ట్ర సమితి అవిర్భావం నుండి సీఎం కేసిఆర్ వెన్నంటే ఉన్నారు. కేసీఆర్ సన్నిహితులలో ఒకరిగా ఆయనకు పేరుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో భూపాలపల్లి నియోజకవ్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ శాసన సభ తొలి స్పీకర్‌గా పనిచేశారు. అయితే 2018లో మరోసారి భూపాలపల్లి నుంచి బరిలో నిలిచిన మధుసూదనాచారి.. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయనను రాజ్యసభకు పంపుతారని, అలా కుదరని పక్షంలో ఎమ్మెల్సీగా మండలికి పంపుతారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనను మండలికి పంపాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 

Also read: 

ఇక, ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి,  కడియం శ్రీహరి, తక్కళపల్లి రవీంద్రరావు, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ కలెకర్టర్ వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాష్‌లు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌ నగర్, కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాల చొప్పున, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించి నవంబర్ 23‌ను నామినేషన్ల స్వీకరణకు అఖరి తేదీ.
 

click me!