ఎనిమిదో నిజాం రాజు ముకరం ఝా మృతి: ఈ నెల 17న హైద్రాబాద్‌కు పార్ధీవదేహం

By narsimha lode  |  First Published Jan 15, 2023, 11:44 AM IST

హైద్రాబాద్  ఎనిమిదో  నిజాం రాజు  ముకరం ఝా  నిన్న రాత్రి మృతి చెందారు. ఆయన పార్థీవ దేహన్ని  హైద్రాబాద్ కు తీసుకు రానున్నారు.  


హైదరాబాద్: హైద్రాబాద్  ఎనిమిదో  నిజాం నవాబ్  భర్కత్  అలీఖాన్ వల్షన్  ముకరం ఝా బహదూర్  శనివారంనాడు టర్కీలోని ఇస్తాంబుల్ లో మృతి చెందారు.ముకరం ఝా  స్వస్థలం   హైద్రాబాద్ లో   అంత్యక్రియలు  చేయాలని ఆయన  కోరిక. దీంతో  ఆయన కోరిక మేరకు  ముకరం ఝా భౌతిక కాయాన్ని  టర్కీ నుండి  కుటుంబ సభ్యులు  హైద్రాబాద్ కు తీసుకువస్తున్నారు. ఈ నెల  17వ తేదీన  హైద్రాబాద్ కు  ముకరం ఝా  పార్ధీవ దేహం తీసుకురానున్నారు. హైద్రాబాద్ కు తీసుకు వచ్చిన తర్వాత  ముకరం ఝా  బౌతిక కాయాన్ని  ప్రజల సందర్శననార్ధం  చౌమల్లా ప్యాలెస్ లో  ఉంచనున్నారు.

హైద్రాబాద్ ఏడో  చివరి నిజాం  మీర్ ఉస్మాన్ అలీ ఖాన్  1954 జూన్  14న ప్రిన్స్ ముకరం ఝా ను తన వారసుడిగా  ప్రకటించారు.  1971 వరకు  ముకరం ఝా హైద్రాబాద్  యువరాజుగా పిలిచారు.1954 నుండి  ముకరం ఝా  హైద్రాబాద్  ఎనిమిదో  రాజుగా  గుర్తించారు.  1971లో  అప్పటి కేంద్ర ప్రభుత్వం  దేశంలోని  సంస్థానాలను రద్దు  చేసింది. 
 

Latest Videos

click me!