నా రాజీనామాతో మునుగోడు ప్రజల డిమాండ్లు నెరవేరుతున్నాయి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

By narsimha lodeFirst Published Aug 12, 2022, 2:40 PM IST
Highlights

తన రాజీనామాతో మునుగోడు ప్రజల డిమాండ్లు నెరవేరుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.  ఉప ఎన్నికలు వస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని మరోసారి నిజమైందన్నారు. 

నల్గొండ: తన రాజీనామాతో మునుగోడు ప్రజల డిమాండ్లు నెరవేరుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం నాడు ఆయన మునుగోడులో మీడియాతో మాట్లాడారు. తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలవగానే సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న గట్టుప్పల్ ను మండలంగా ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారన్నారు.ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో అక్కడే సమస్యల పరిష్కారం కోసం  రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తాను చేసిన వ్యాఖ్యలు నిజమని ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్న  పరిణామాలను చూస్తే అర్ధం అవుతుందన్నారు. తాను రాజీనామా ప్రకటించడంతో చేనేత కార్మికులకు కూడా పెన్షన్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.  తన రాజీనామాతో మునుగోడుతో పాటు రాష్ట్రంలోని పలు సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నం చేస్తుందన్నారు. 

also read:నన్నుహోంగార్డుతో పోల్చారు, పార్టీ నుండి పంపే ప్రయత్నం: రేవంత్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించాలని తాను పలు దఫాలుగా అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను రాజీనామా సమర్పించగానే నియోజకవర్గం మొత్తం రోడ్ల పనులు ప్రారంభమైన విషయాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించారు.మూడున్నర ఏళ్లుగా ఎన్ని నిిధులు ఇచ్చారో ఈ నెల 20న జరిగే సభలో కేసీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. మునుగోడు ఉప ఎన్నికే కేసీఆర్ తో జరుగుతున్న యుద్ధంగా ఆయన పేర్కొన్నారు.

గత మాసంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని తేలిపోయింది. పార్టీ మారడం లేదని తొలుత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోసిపుచ్చారు ఆ తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.ఈ నెల 2వ తేదీన కాంగ్రెస్ కు ,ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. 

గత మాసంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని తేలిపోయింది. పార్టీ మారడం లేదని తొలుత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోసిపుచ్చారు ఆ తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.ఈ నెల 2వ తేదీన కాంగ్రెస్ కు ,ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. 

ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను పంపారు.ఈ నెల 8వ తేదీన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామా చేశారు.  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోమటిరెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించారు.ఈ స్థానం ఖాళీ అయిందని ఈసీకి తెలంగాణ స్పీకర్ కార్యాలయం సమాచారం పంపింది.  దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఆరు మాసాల్లో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.ఈ నెల 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ స్థానంనుండి బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు కూడాఈ స్థానంలో తమ పట్టును నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.

click me!