మంత్రి సత్యవతి రాథోడ్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత..

By Bukka Sumabala  |  First Published Aug 12, 2022, 2:05 PM IST

రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ తల్లి గతనెల చివర్లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత శుక్రవారం సత్యవతిరాథోడ్ ను కలిసి పరామర్శించారు. 


మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోత్ దస్మా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం రోజు ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌ రాజీవ్ సాగ‌ర్‌,హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రి సత్యవతి రాథోడ్ నివాసంలో వారిని కలిసి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, గుగులోత్ దస్మా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

Latest Videos

జూలై 29న తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తల్లిని కోల్పోయారు. ఆమె తల్లి గుగులోతు దాస్మి (80) హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంత్రి సత్యవతిరాథోడ్ ఇటీవల తన తండ్రిని కోల్పోయారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే తల్లి మృతి వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జూలై 30న ఉదయం మంత్రి సత్యవతి స్వగ్రామమైన కురవిమండలం పెద్దతండాలో గుగులోతుదస్మి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.

click me!