నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ వి. తులసీరామ్ కన్నుమూత

By narsimha lodeFirst Published Apr 16, 2020, 10:44 AM IST
Highlights
నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ వి. తులసీరామ్ అనారోగ్యంతో గురువారం నాడు మృతి చెందారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి తులసీరామ్ 1984 నుండి 1989 వరకు ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు.

హైదరాబాద్: నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ వి. తులసీరామ్ అనారోగ్యంతో గురువారం నాడు మృతి చెందారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి తులసీరామ్ 1984 నుండి 1989 వరకు ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు.

తులసీరామ్ 1938 అక్టోబర్ 2వ తేదీన హైద్రాబాద్ లో పుట్టాడు. ఆయన వయస్సు 82 ఏళ్లు.ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్న తులసీరామ్ ఆ తర్వాత టీడీపీలో చేరారు. 1984లో టీడీపీ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. 

అనారోగ్యంతో ఆయన ఇవాళ మృతి చెందాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గగన్ పహాడ్ గ్రామసర్పంచ్ గా 1959 నుండి 1971 వరకు ఆయన పనిచేశాడు. అదే సమయంలో రాజేంద్రనగర్ పంచాయితీ సమితి ప్రెసిడెంట్ గా కూడ ఆయన పనిచేశాడు.

 ఆ తర్వాత ఆయన నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు.కొద్దికాలం పాటు ఆయన టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కూడ పనిచేశారు. 
 
click me!