కరోనా భయం.. తలనీలాలు అర్పించిన యువకులు

By telugu news teamFirst Published Apr 16, 2020, 10:33 AM IST
Highlights
చాలా మంది ప్రజలు ఈ వైరస్ భయంతో భయటకు రావడానికి వణుకుతున్నారు. కొందరు బయటకు వచ్చినా.. సామాజిక దూరం పాటిస్తున్నారు. ఈ వైరస్ ప్రభలకుండా ఉండటానికి ఎంత సామాజిక దూరం పాటిస్తే అంత మంచిదని నిపుణులు, ప్రభుత్వాలు వివరిస్తున్నాయి.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించినప్పటకీ.. కేసులు పెరిగిపోతుండటం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే స్పందించి... తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించింది. అయినప్పటికీ కేసులు పెరుగుతుండటం గమనార్హం.

అయితే.. చాలా మంది ప్రజలు ఈ వైరస్ భయంతో భయటకు రావడానికి వణుకుతున్నారు. కొందరు బయటకు వచ్చినా.. సామాజిక దూరం పాటిస్తున్నారు. ఈ వైరస్ ప్రభలకుండా ఉండటానికి ఎంత సామాజిక దూరం పాటిస్తే అంత మంచిదని నిపుణులు, ప్రభుత్వాలు వివరిస్తున్నాయి.

అయితే.. అవేమీ పట్టకుండా కొందరు మూఢనమ్మకాలను పోతున్నారు. దూరంగా ఉండండిరా బాబు అంటే.. గుంపులు గుంపులుగా ఆలయాలకు వెళుతున్నారు. తాజాగా.. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ లో దాదాపు 20మందికి పైగా యుకులు కులదేవతకు పూజలు చేయడానికి గుంపుగా వెళ్లారు.

అక్కడ అమ్మవారికి పూజలు చేసి..కరోనా రాకుండా ఉండేలా ఆశీర్వదించాలంటూ అమ్మవారికి తలనీలాలు సమర్పించారు. అయితే.. అలా మూకుమ్మడిగా వెళ్లకుండా... దూరం పాటిస్తే అందరికీ మంచిదంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి.
click me!